న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంక్ యూనియన్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్యాంక్‌లు బంద్ చేపడుతున్నాయి. ఈ నెల 8న(బుధవారం) విధులకు రావొద్దని బ్యాంక్ యూనియన్లు ఉద్యోగులకు సూచించాయి. కేంద్ర ట్రేడ్ యూనియన్లు చేపడుతోన్న ఆల్ ఇండియా జనరల్ స్ట్రయిక్‌లో పాల్గొనాలని బ్యాంక్ యూనియన్లు కూడా నిర్ణయించాయి.
దీంతో సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా బ్యాంకులపై పడనున్నాయి. బుధవారం రోజున బ్రాంచ్‌ల్లో జరిగే సాధారణ బ్యాంకింగ్ సేవలన్నీ నిలిచిపోనున్నాయి. ఈ సమ్మె ప్రభావం ఏటీఎం సేవలపై కూడా చూపనున్నట్టు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం ఈ సమ్మెకు ప్రభావితం కావు. స్ట్రయిక్ రోజు ఎలాంటి క్లరికల్ వర్క్‌ను చేపట్టవద్దని తమ సభ్యులను ఆదేశించినట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్(ఏఐబీఓసీ) జనరల్ సెక్రటరీ సౌమ్య దత్తా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment