Venkatachalam ch
-
కస్టమర్లకు అలర్ట్ : ఉద్యోగుల స్ట్రైక్..ఆ రోజు పని చేయని బ్యాంకులు
బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఇటీవల బ్యాంకు ఉద్యోగులపై పెరిగిపోతున్న దాడుల్ని నిరసిస్తూ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. వచ్చే నెల 19న ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) ఆధ్వర్యంలో స్ట్రైక్ జరగనుంది. ఆ రోజు బ్యాంకుల్లో కార్యకలాపాలకు విఘాతం కలగనుంది. ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్.వెంకటాచలం తెలిపిన వివరాల మేరకు..ఏఐబీఈఏ యూనియన్‌లో యాక్టీవ్‌గా ఉన్నారనే కారణంగా బ్యాంకు ఉద్యోగులపై వేధింపులు కొనసాగుతున్నాయని అన్నారు. అందుకే ఈ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అందుకు ఊతం ఇచ్చేలా ఏఐబీఏ యూనియన్ నాయకులను సోనాలి బ్యాంక్, ఎంయూఎఫ్‌జీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సర్వీస్ నుండి తొలగించాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ప్రభుత్వ బ్యాంకులు ట్రేడ్ యూనియన్ హక్కులను నిరాకరిస్తున్నాయని, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ బ్యాంకులు అనేక బ్యాంకింగ్ కార్యకలాపాలను ఔట్ సోర్సింగ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం ఉద్యోగుల్ని విచక్షణారహితంగా బదిలీ చేస్తుందన్నారు. ద్వైపాక్షిక సెటిల్మెంట్, బ్యాంక్ లెవల్ సెటిల్మెంట్ను ఉల్లంఘిస్తూ 3,300 మందికి పైగా క్లరికల్ సిబ్బందిని ఒక స్టేషన్ నుండి మరో స్టేషన్‌కు బదిలీ చేశారన్నారని అన్నారు. పై వాటన్నింటిని తిప్పికొట్టడం లేదా ప్రతిఘటించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం చెప్పారు. చదవండి👉 హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త -
ఈ నెల ఆఖరున బ్యాంకు ఉద్యోగుల సమ్మె
-
రెండు రోజులు బ్యాంకు ఉద్యోగుల బంద్
ముంబై : బ్యాంకు ఉద్యోగులు మరోసారి బంద్‌కు దిగబోతున్నారు. ప్రైవేట్, పబ్లిక్ రంగ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది బ్యాంకర్లు ఈ నెల ఆఖరున 48 గంటల పాటు బంద్‌కు దిగనున్నట్టు పిలుపునిచ్చారు. వేతనాల సమీక్ష విషయంలో శనివారం యునిటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్లు(యూఎఫ్‌బీయూ)కి, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)కి మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో బ్యాంకు ఉద్యోగులు ఈ బంద్ చేపట్టబోతున్నారు. యూఎఫ్‌బీయూలో తొమ్మి బ్యాంకు యూనియన్లు ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగులకు అందించే వేతన పెంపు చాలా తక్కువ మొత్తంలో ఉందని బ్యాంకర్లు ఆరోపిస్తున్నారు. కేవలం రెండు శాతం పెంపు చేపట్టడం చాలా దారుణమన్నారు. బ్యాంకు ఉద్యోగుల వేతన చర్చలను, వేతన సమీక్షను 2017 నవంబర్ 1వరకు పూర్తి చేయాలని బ్యాంకు మేనేజ్మెంట్లను, ఐబీఏను ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పలు సార్లు ఇండియన్ బ్యాంకు అసోసియేషన్, బ్యాంకు యూనియన్లకు మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై 2018 మార్చి 15న యూనియన్లు బంద్‌కు పిలుపునిచ్చాయి. మరోసారి ఐబీఐ చర్చలకు పిలవడంతో, యూనియన్లు ఆ బంద్‌ను వాయిదా వేశాయి. శనివారం ముంబైలో బ్యాంకు యూనియన్లకు, ఐబీఏకు మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఈ నెల ఆఖరున రెండు రోజులు బంద్‌చేపట్టాలని యూనియన్లు నిర్ణయించాయి. 2012 నవంబర్ 1న 10వ బిపర్‌టైట్ వేతన ఒప్పందంలో భాగంగా మొత్తం వేతన బిల్లులో 15 శాతానికి పైగా పెంపుదలను ఐబీఏ ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. కానీ ఈ పెంపును 2 శాతం మాత్రమే చేపట్టనున్నట్టు ఐబీఏ 2017 మార్చి 3న ప్రకటించింది. ప్రస్తుతం ఐబీఏ ఆఫర్‌చేసే మొత్తం చాలా తక్కువగా ఉందని, ఈ ఆఫర్‌ను యూనియన్లు తిరస్కరిస్తున్నట్టు టాప్ యూనియన్ నాయకుడు చెప్పారు. ఈ విషయంలో వెంటనే ఆర్థిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని యూనియన్లు కోరుతున్నాయి. వేతన పెంపును పెంచేలా ఐబీఏకి సూచించాలని, ఒకవేళ ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయంలో విఫలమైతే ఈ నెల చివరిన 48 గంటల పాటు బంద్ చేయనున్నామని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచలం తెలిపారు. -
బ్యాంకుల సమ్మె సక్సెస్
చెన్నై, సాక్షి ప్రతినిధి : అఖిలభారత బాంకు ఉద్యోగుల సంఘం ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం తలపెట్టిన బ్యాం కుల సమ్మె విజయవంతమైంది. రాష్ట్రంలోని 6 వేల బ్యాంకుల లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జీతాల పెంపును పూర్తిచేయాలని, ఐదు రోజుల పనిదినాలను ప్రవేశపెట్టాలని, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు ఒక్కరోజు సమ్మె పాటిం చారు. ఉన్నతాధికారి మొదలుకుని బంట్రోతు వరకు సమ్మెలో పాల్గొనడంతో బ్యాంకులన్నీ బోసిపోయూరుు. బ్యాంకుల్లో పూర్తిగా లావాదేవీలు స్తంభించిపోయా యి. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా ఉన్నవారికి మాత్ర మే వంటగ్యాస్ సబ్సిడీ సదుపాయం లభిస్తుందని కేంద్రం షరతు విధించింది. ఈనెలాఖరులోగా ఇందు కు అవసరమైన పనులు పూర్తిచేయాల్సి ఉండగా, దీంతో ఆధార్‌కార్డు నెంబర్లను బ్యాంకుల్లో రిజిస్టర్ చేసుకోలేక ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. తమిళనాడులో 6వేల శాఖలకు సంబంధించి 50 వేల మం ది, చెన్నైలో 1300 శాఖల్లోని 15 వేల మంది సమ్మెలో పాల్గొన్నారు. 4వ తేదీ వరకు దేశంలో సమ్మె తమ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్త సమ్మెను నాలు గు దశల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. తొలి దశగా మంగళవారం తమిళనాడుతోపాటు పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1.50 లక్షల మంది సమ్మెలో పాల్గొనగా 23 వేల బ్యాంకులు మూతపడ్డాయని ఆయన అన్నారు. ఈనెల 3వ తేదీన ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోనూ, 4వ తేదీన తుదిదశగా పశ్చిమబెంగాల్, ఒడిశా, బీహార్, త్రిపుర రాష్ట్రాల్లో సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.