ముంబై: వచ్చే నెల ఏడున జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం పుణేకు చెందిన వ్యాపారవేత్త సంజయ్ కకాడే గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు పది మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ బాంబ్, రవి రాణా, శిరీశ్ కోత్వల్, సీతారామ్ గణదత్, బలిరామ్ సిరస్కర్, సురేశ్ జెతిలియా, ఓంప్రకాశ్ అలియాస్ బచుచ్ కడు, ప్రదీప్ జైస్వాల్, అనిల్ బొండే, హరిదాస్ భడే మద్దతు ప్రకటించారు. నిర్మాణ రంగం, హోటల్ వ్యాపారం చేస్తున్న 46 ఏళ్ల కకాడే 1982లో ఏడో తరగతి వరకు చదువుకున్నట్టు ఈసీకి సమర్పించిన నామినేషన్ సెట్‌లో పేర్కొన్నారు. ఏప్రిల్ రెండున రాష్ట్రానికి చెందిన రాజ్యసభలోని ఏడుగురు సభ్యులు పదవీ విరమణ చేయనుండటంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్సీపీ తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, ప్రముఖ న్యాయవాది మజీద్ మెమన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఇదిలావుండగా ఢిల్లీలో శుక్రవారం జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాజ్యసభకు ఎవరినీ అభ్యర్థులుగా ప్రకటించాలనే దానిపై ఓ స్పష్టత రానుంది. శివసేన ఇద్దరిని బరిలోకి దించే అవకాశం కనబడుతోంది. అసెంబ్లీలో ప్రస్తుతం శివసేనకు 45 సభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే ఒక అభ్యర్థి ఎన్నికయ్యేందుకు 36 మంది సభ్యుల మద్దతు అవసరం కానుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
రాజ్యసభకు సంజయ్ కకాడే నామినేషన్
Published Thu, Jan 23 2014 11:09 PM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
Advertisement