ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ధనంజయ్ నామినేషన్
Published Thu, Aug 22 2013 11:42 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, ముంబై: బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే సోదరుని కుమారుడైన ధనంజయ్ ముండే విధానమండలి ఉపఎన్నిక కోసం ఎన్సీపీ తరఫున గురువారం నామినేషన్ దాఖలు చేశారు. బాబాయి గోపీనాథ్ తీరును నిరసిస్తూ ఏడాదిక్రితం ధనంజయ్ ఎన్సీపీలో చేరిన సంగతి విదితమే. ఆ తర్వాత కొంతకాలంపాటు ఎమ్మెల్సీగా కొనసాగిన ధనంజయ్..
ఈ ఏడాది జులై రెండో తేదీన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ప్రస్తుతానికి ధనంజయ్ ఎమ్మెల్సీ ఎన్నిక బరిలోకి దిగినప్పటికీ.. 2014లో జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో కూడా ఆయనను పోటీ చేయిం చాలని ఎన్సీపీ యోచిస్తున్నట్టు సమాచారం. కాగా పార్టీ ఆదేశిస్తే ఎక్కడినుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ధనంజయ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement