'నివేదికలు ఇవ్వకుండా నిధులు ఎలా కేటాయిస్తారు' | bjp leader purandeswari slams cm chandrababu over polavaram project | Sakshi
Sakshi News home page

'నివేదికలు ఇవ్వకుండా నిధులు ఎలా కేటాయిస్తారు'

Published Sat, Sep 3 2016 6:54 PM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

'నివేదికలు ఇవ్వకుండా నిధులు ఎలా కేటాయిస్తారు' - Sakshi

'నివేదికలు ఇవ్వకుండా నిధులు ఎలా కేటాయిస్తారు'

విజయవాడ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం అభ్యంతరం చెబుతోందని బీజేపీ మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి చెప్పారు. విజయవాడలో శనివారం బీజేపీ పదాధికారుల సమావేశనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.... ఏపీకి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం లేదని టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 
 
ఇప్పటి వరకు కేంద్రం రూ.4వేల కోట్లు రెవెన్యూ లోటు భర్తీ చేసిందని పురందేశ్వరి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన జరగడం లేదని...పోలవరం అథారిటీని పరిగణనలోకి తీసుకోకుండా అంచనాలు పెంచేశారని ఆమె ఆరోపించారు. పోలవరంలో పట్టిసీమ అంతర్భాగం కాదన్నారు. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ప్రభుత్వం సరైన డీపీఆర్ ఇవ్వలేదని పేర్కొన్నారు. అయినా రాజధానికి కేంద్ర ప్రభుత్వం రూ.1050 కోట్లు ఇచ్చిందని గుర్తుకు చేశారు. రాజధానికి, పోలవరానికి సంబంధించి ఏ నివేదికలు ఇవ్వకుండా కేంద్రం నిధులు కేటాయించలేదంటే ఎలా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని పురందేశ్వరి ప్రశ్నించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement