పెళ్లి కుమార్తె కిడ్నాప్ | Bride kidnapped by Unidentified assaultes | Sakshi
Sakshi News home page

పెళ్లి కుమార్తె కిడ్నాప్

Published Mon, Oct 26 2015 6:33 PM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

పెళ్లి కుమార్తె కిడ్నాప్

పెళ్లి కుమార్తె కిడ్నాప్

* అడ్డుకున్న చిన్నాన్న హత్య
* నిందితుల కోసం పోలీసులు గాలింపు
 
వేలూరు: పెళ్లి కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.. అడ్డుకున్న ఆమె చిన్నాన్నను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన తమిళనాడు వేలూరు జిల్లా వాలాజ గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన ఆరుముగం(40) తిరువణ్ణామలైలోని గిరివలయం రోడ్డులో ఫర్నీచర్ దుకాణం నడుపుతున్నాడు. అతని కుమార్తె లావణ్య తిరువణ్ణామలైలోని తాత ఇంటిలో ఉంటూ బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తిరువణ్ణామలైలోని కణ్ణన్ కుమారుడు, ఆటోడ్రైవర్ కార్తీక్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో కార్తీక్ ఆమె వెంటపడేవాడు.లావణ్య తల్లిదండ్రులు తిరువణ్ణామలై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కార్తీక్‌ను పిలిచి హెచ్చరించి వదిలేశారు.

 

ఈ నేపథ్యంలో లావణ్యకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. లావణ్యను తిరువణ్ణామలై నుంచి వాలాజకు తీసుకొచ్చి ఇంటిలో పెట్టి తాళం వేశారు. కార్తీక్ తిరువణ్ణామలైలోని అతని స్నేహితులు ముగ్గురిని తీసుకొని కారులో లావణ్య ఇంటి వద్దకు వచ్చి సినీ పక్కీలో ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. దీన్ని చూసిన లావణ్య చిన్నాన శివకుమార్(35) అడ్డగించి కారులో వెనుక వైపు ఎక్కాడు. కొద్దిదూరం వెళ్లాక జాతీయ రహదారి రాగానే శివకుమార్‌ను కారులో నుంచి కిందకు తోశారు. శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వాలాజ పోలీసులు కేసు నమోదు చేసి, కార్తీక్‌తో పాటు అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement