కన్నతల్లి కర్కశత్వం
Published Mon, Mar 20 2017 5:25 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
సిఫ్‌కాట్ : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఒకటిన్నరేళ్ల కన్న కూతురినే హత్య చేసిందో తల్లి. ఉద్దనపల్లి కెలమంగలం రోడ్డులోని హనుమంతపురం గ్రామానికి చెందిన కెంపయ్య, రాధ దంపతులకు మహేంద్రన్(4), మధుశ్రీ అనే ఒకటిన్నరేళ్ల పాప ఉంది. శనివారం ఉదయం చిన్నారి మధుశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
పోలీసులు కేసు నమోదు చేసుకొని తల్లి రాధను విచారించగా అసలు విషయం బయటపడింది. రాధకు హŸసూరు సమీపంలోని మాయనాయకనపల్లికి చెందిన శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం ఉండేది. మూడు నెలల క్రితం రాధ చిన్నారిని తీసుకొని శ్రీనివాస్‌తో వెళ్లిపోయింది. గత 15వ తేదీ మళ్లీ భర్త ఇంటికి వచ్చింది. మళ్లీ శ్రీనివాస్‌తో వెళ్లేందుకు ప్రయత్నించగా భర్త కెంపయ్య డెంకణీకోట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో వివాహేతర సంబంధానికి చిన్నారి అడ్డుగా ఉందని గొంతునులిమి హత్య చేశానని రాధ పోలీసుల ఎదుట అంగీకరించింది.
Advertisement
Advertisement