
వాజపేయి పేరును నేనే సూచించా: చంద్రబాబు
అమరావతి: మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం మొత్తం గర్వించదగిన మహా దార్శనికుడు, పరిపాలనా దక్షుడు అటల్ బిహారీ వాజ్‌పేయి అని ఆయన అన్నారు.
స్వర్ణ చతుర్భుజి సహా మౌలిక రంగ అభివృద్ధికి వాజ్‌పేయి కాలంలో విశేషమైన కృషి జరిగిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మంగళగిరి దగ్గర ఎయిమ్స్‌కు అటల్ బిహారీ వాజపేయి పేరు పెట్టాలని తానే సూచించినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. వాజపేయి నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు.