ఆర్యతో స్వాతి డబుల్ రొమాన్స్ | Colours Swathi to romance with Arya | Sakshi
Sakshi News home page

ఆర్యతో స్వాతి డబుల్ రొమాన్స్

Published Mon, Jun 22 2015 3:35 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

ఆర్యతో స్వాతి డబుల్ రొమాన్స్

ఆర్యతో స్వాతి డబుల్ రొమాన్స్

 కథా నాయకుల కంటే కథా నాయికలే అధికంగా బహుభాషా నటీమణులుగా వెలుగొందుతున్నారన్నది నిజం. అయితే చాలామంది హీరోయిన్లు ఒక భాషలో మార్కెట్ తగ్గితే మరో భాషపై దృష్టి సారిస్తుండడం సహజం. అలాగైనా తమ స్థానాన్ని పదిలపరచుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. విజయం తనతో దోబూచులాడుతున్న నటి తాప్సీకి కాంచన -2 చిత్రం చాలా ఊరటనిచ్చింది. అయినా అందం, అభినయం ఈ రెండింటిలో తనకేమి కొరత అని తెలుగులో అవకాశాలు రావడం లేదు అంటూ వాపోయిందీ భామ.
 
 అలాంటిది నటి స్వాతి, తెలుగు, తమిళం, మలయా ళం అంటూ మూడు భాషల్లోనూ మంచి పేరుతో పాటు వరుసగా అవకాశాలు సంపాదించుకోవడం విశేషం. పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న స్వాతి పదహారణాల తెలుగింటి ఆడపడచు అన్న విషయం తెలిసిందే. ఇంట గెలచి రచ్చ గెలవాలంటారు. స్వాతి ఇంటినే కాదు పొరుగింటిలోనూ ఇరుగింటిలోను గెలిచి నటిగా కెరీర్‌ను విస్తరించుకుంటున్నారు. పెద్దగా స్టార్‌డమ్‌ను సంపాదించుకోకపోయినా చిన్న నిర్మాతలకు అనువైన నటిగా పేరు తెచ్చుకున్న స్వాతికి తమిళంలో ఆ మధ్య విడుదలైన వడకరై చిత్రం రిజల్ట్స్ సంతృప్తినే ఇచ్చింది. స్వాతి త్రిభాషా నటి కావడంతో నిర్మాతలు ఆమెను అలా ఉపయోగించుకుంటున్నారు.
 
  మలయాళంలో నటించిన మోసైయిలే కుదిరమీనుగళ్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ ఏడాది మొదట్లో తెరపైకి వచ్చిన మలయాళ చిత్రం ఆడు మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. అయినా అవకాశాలు స్వాతి తలుపు తడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె రెండు ద్విభాషా చిత్రాలు చేస్తున్నారు. అందులో ఒకటి డబుల్ బేరల్ కాగా మరొకటి విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్న యట్చన్. విశేషం ఏమిటంటే ఈ రెండు చిత్రాల్లోనూ స్వాతికి హీరో ఆర్యనే. ఇలా ఒకేసారి ఆర్యతో రెండు చిత్రాలు చేయడం వినూత్న అనుభవం అంటున్నారు స్వాతి. అదే విధంగా ఈ రెండు చిత్రాలు తన కెరీర్‌ను మరింత పెంచే విధంగా ఉంటాయనే ఆశాభావాన్ని కలర్ భామ వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement