చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ ఫైర్
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుపై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ఆయనిక్కడ సోమవారం మాట్లాడుతూ చంద్రబాబు చెప్పేవి నీతులు, చేసేవి అనినీతి పనులన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఉపాధ్యాయులకు డబ్బులు పంపిణీ చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటివరకు ఏ సీఎం టీచర్, పట్టుభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు. చంద్రబాబు ప్రలోభాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
రూ. కోట్లు ఖర్చు పెట్టి వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాలను చంద్రబాబు భ్రష్టుపటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కరువు బాధితుల స్థితిగతులను తెలుసుకునేందుకు మార్చి 2,3 తేదీల్లో తమిళనాడు, కేరళ రాష్టాల్లో పర్యటించనున్నట్టు రామకృష్ణ తెలిపారు.