నేర నగరి
- బెంగళూరులో పెరిగిపోతున్న నేరాల సంఖ్య
బెంగళూరు : రాష్ట్రంలో నేరాల శాతం పెరిగిపోతోంది. ఉద్యోగ, ఉపాధి పనుల ముసుగులో బెంగళూరుకు చేరుకుంటున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు నేరాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ప్రధానంగా బెంగళూరులో మహిళలు, ఆడపిల్లలు, ఒంటరి మహిళలకు రక్షణ కరువైందని పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని ప్రముఖ నగరాలతో పోల్చుకుంటే క్రైం రేట్‌లో బెంగళూరు మూడవ స్థానంలో ఉంది. దీనికి తోడు కేసుల పరిష్కారంలో జాప్యం కూడా పోలీసు అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
మహిళలు.. చిన్నారులపై దౌర్జన్యాలు
బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో ఇటీవల మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి. ఇలాంటి కేసులను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేపడుతున్నా ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలు, యువతులు, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయి. 2012 నుంచి 2014 జూన్ 15 వరకు పోల్చుకుంటే ఇలాంటి కేసులు సంఖ్య పెరిగింది.
దారి దోపిడీలు దొంగతనాలు
బెంగళూరులో దారి దోపిడీలతో పాటు చోరీలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఐదు నెలల వ్యవధిలో బెంగళూరులో 20కి పైగా దారి దోపిడీలు జరిగాయి. వాటిలో 10 కేసులలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మి గిలిన కేసులలో నిందితుల ఆచూకీ లభ్యం కాలే దు. డ్రాప్ నెపంతో లూటీలకు పాల్పడిన 278 కేసులు నమోదు అయ్యాయి. అందులో 193 కేసుల దర్యాప్తు పూర్తి అయ్యింది. మిగిలిన కేసులలో నిందితుల ఆచూకీ ఇప్పటికీ చిక్కలేదు. బెంగళూరులో ఒంటరిగా ఉన్న ఆరు గు రు హహిళలు దారుణ హత్యకు గురైనారు. మూ డు కేసులలో మాత్రం హంతకులు పట్టుబడ్డా రు. మిగిలిన మూడు కేసులు దర్యాప్తులో ఉన్నాయి.