భివండీలో పట్టపగలు హత్య | daylight murder in Bhivandi | Sakshi
Sakshi News home page

భివండీలో పట్టపగలు హత్య

Published Wed, Dec 10 2014 10:21 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

daylight murder in Bhivandi

భివండీ, న్యూస్‌లైన్: పట్టపగలు ఒక వ్యక్తిని కత్తితో పొడిచి హత్యచేశారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం సోమానగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. హత్యచేసిన అనంతరం నిందితుడు నేరుగా బోయివాడ పోలీస్‌స్టేషన్‌కు పోయి స్వచ్ఛందంగా లొంగిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. ముక్తార్ అహ్మద్ షేక్(28), మోమిన్ షేక్(పప్పు) ఇద్దరూ ప్లంబర్లుగా జీవనాన్ని సాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య గత పదేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత విధానసభ ఎన్నికల్లో ముక్తార్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశాడు.

అతడు గెలుపొందడంతో సహజంగానే ముక్తార్‌కు పని పెరిగింది. ఇదే సమయంలో మోమిన్‌షేక్‌కు పనులు తగ్గిపోయాయి. దీంతో ముక్తార్‌పై మోమిన్ కక్ష పెంచుకున్నాడు. కాగా, బుధవారం మధ్యాహ్నం ముక్తార్ సోమానగర్ ప్రాంతంలో కుళాయి మరమ్మతులు చేస్తుండగా మోమిన్ వెనుకనుంచి వచ్చి అతడిపై కత్తితో దాడిచేశాడు. సుమారు పది కత్తిపోట్లు పడటంతో ముక్తార్ తీవ్ర రక్తస్రావంతో మరణించాడు. దాడి అనంతరం మోమిన్ బోయివాడ పోలీస్ స్టేషన్‌కు పోయి నేరాన్ని ఒప్పుకుని లొంగిపోయాడు. ముక్తార్ మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఇందిరా గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement