నేడు దేవర్ జయంతి
Published Wed, Oct 30 2013 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
సాక్షి, చెన్నై: దక్షిణాది జిల్లాల్లో అత్యధిక జనాభా కలిగిన ముక్కుళత్తూరు సామాజిక వర్గ ప్రజల ఆరాధ్యుడు, రాజకీయవేత్త పసుం పొన్ దేవర్. ఆయన జయంతి, వర్ధంతి అక్టోబర్ 30. ఈ వేడుకను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడు మ రామనాథపురం, మదురై, శివగంగై, తిరునల్వేలి, తిరుచ్చి, పుదుకోట్టై తదితర జిల్లాల్లో జరుపుకుంటున్నారు. రామనాథపురం జిల్లా కౌముదిలోని ముత్తురామలింగం దేవర్ స్మారక ప్రదేశంలో కనుల పండువగా ఈ వేడుకలు జరుగుతాయి. దేవర్ జయంతి వేడుకల్లో గతంలో ముక్కుళత్తూరు, ఇతర సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కొన్నేళ్లుగా శాంతియుతంగానే వేడుకలు జరుగుతున్నాయి.సర్వం సిద్ధం: దేవర్ జన్మస్థలం పసుంపొన్, స్మారక ప్రదేశం కౌముదిలో రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. అవాం ఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బం దీగా చర్యలు తీసుకున్నారు.
రామనాథపురం, కౌముది, పసుంపొన్‌లో ర్యాలీలు, సభల నిర్వహణపై నిషేధం విధించారు. దక్షిణాది జిల్లాల ఐజీ అభయ్‌కుమార్ నేతృత్వంలో డీఐజీ అమల్‌రాజ్ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పా ట్లు చేశారు. రామనాథపురం, మదురై, శివగంగై, తిరునల్వేలి, విరుదునగర్, తిరుచ్చి, పుదుకోట్టైలోని సమస్యాత్మక ప్రాంతాల్ని నిఘా వలయంలోకి తెచ్చారు. కౌముది, ముదుగళత్తూరు, పసుంపొన్‌లో ఐదు వేల మంది భద్రతకు దిగారు. ఆయా జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చే వారి వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. కౌముది గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే అన్ని వాహనాలనూ నిలిపేయనున్నారు. చెన్నై అన్నాసాలైలలోని దేవర్ విగ్రహం వద్ద వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి జయలలిత, వివిధ రాజకీయ పార్టీల నేతలు నివాళులర్పించనున్నారు.
వేడుకలు ఆరంభం: తొలిరోజు గురు పూజోత్సవంతో వేడుకలు ఆరంభమయ్యాయి. పసుం పొన్, ముదుగళత్తూరు పరిసర గ్రామాలకు చెందిన ముక్కుళత్తూరు సామాజిక వర్గానికి చెందిన వారు పది వేల మందితో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కౌముది వైపుగా వెళ్లేందుకు కొందరు దూసుకు రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఉన్నతాధికారులు జోక్యంతో అక్కడి ప్రజ ల్ని బృందాలుగా బస్సుల ద్వారా కౌముదిలోని స్మారక ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ పాలాభిషేకం జరిగింది. బుధవారం ఉదయం జయం తి వేడుకలు ఘనంగా జరగనున్నాయి.
Advertisement
Advertisement