సింధనూరు టౌన్, న్యూస్‌లైన్ : బీజేపీలోకి తిరిగి చేరే విషయంలో తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని, ఒకవేళ అలాంటి ఆహ్వానం ఏదైనా అందితే తమ పార్టీ నాయకులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని బీఎస్‌ఆర్ పార్టీ సంస్థాపక అధ్యక్షుడు బీ. శ్రీరాములు అన్నారు. ఆయన శుక్రవారం సింధనూరులో విలేకరులతో మాట్లాడారు. బీజేపీలోకి యడ్యూరప్పను తిరిగి చేర్చుకునే విషయంలో ప్రయత్నాలు జరిగి ఉండవచ్చన్నారు. అయితే చేరిక విషయంలో తాను ఎలాంటి వ్యక్తిగత నిర్ణయం తీసుకునేది లేదన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలను నిర్ల క్ష్యం చేయడం వల్ల తమ పార్టీ అభ్య ర్థులు ఓటమి పాలు కావాల్సి వచ్చిందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇది పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బళ్లారి, చిత్రదుర్గం, హావేరి, రాయచూరు, కొప్పళ జిల్లాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాలనే యోచన ఉందన్నారు. బెళగావి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి బట్టబయలైందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిపై మండిపడ్డారన్నారు.
కొందరు ఉపాధ్యాయులు కూడా డిమాండ్ల పరిష్కారం కోసం పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడటం చూస్తే ప్రభుత్వం ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చడంలో ఎంతగా విఫలమైందో అర్థమవుతుందన్నారు. వెంటనే వరి, మొక్కజొన్న, పత్తికి మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరే ప్రయత్నాలు చేస్తున్న విషయం గుర్తు చేయగా, తాము ఆయన కన్నా చిన్నవారమని, చిన్న చిన్న తప్పులు చేసి ఉండవచ్చని వాటిని ఆయన క్షమిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. కార్యక్రమంలో బీఎస్‌ఆర్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.కరియప్ప, బసనగౌడ దద్దల్, ప్రముఖులు కే.భీమణ్ణ, వకీల్ నిరుపాది తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు
Published Sat, Dec 28 2013 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement