సాక్షి, బెంగళూరు: రాష్ట్ర సమాచార శాఖ మంత్రి సంతోష్ లాడ్ అక్రమ గనుల వ్యవహారంలో భాగస్వామ్యం కలిగి ఉండటంతో పాటు అక్రమ గనుల తవ్వకాలకు పాల్పడుతున్న వారికి సహాయంగా కూడా నిలిచారని నేషనల్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్(ఎన్‌సీపీఎన్‌ఆర్) వ్యవ స్థాపకుడు హీరేమఠ్ ధ్వజమెత్తారు. సంతోష్ లాడ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఆయన తన బృందంతో గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్‌ను కలిశారు. రాజ్‌భవన్‌లో మంగళవారం భరద్వాజ్‌ను కలిసిన హీరేమఠ్.. సంతోష్‌లాడ్ అక్రమ గనుల వ్యవహారంపై గంట పాటు చర్చించారు.
అనంతరం హీరేమఠ్ విలేకరులతో మాట్లాడుతూ...అక్రమ గనుల వ ్యవహారంలో సంతోష్‌లాడ్ పాత్ర గురించి గవర్నర్ భరద్వాజ్‌కు అన్ని విషయాలు తెలియజేశావ ుని చెప్పారు. అన్ని విషయాలను సావధానంగా విన్న గవర్నర్ మంత్రుల విషయంలో చర్యలు తీసుకునే అధికారం ముఖ్యమంత్రికే ఉంటుందని చెప్పారన్నారు. సంతోష్ లాడ్ అక్రమ గనుల వ్యవహారానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు తమకు అందలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చెబుతూ వస్తున్నారని తెలిపారు. అందుకే అన్ని ఆధారాలతో కూడిన 126 పేజీల నివేదికను గవర్నర్ భరద్వాజ్‌కు అందజేస్తూ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీలకు సోమవారం సాయంత్రం స్పీడ్ పోస్ట్ ద్వారా పంపినట్లు చెప్పారు.
అక్రమ గనుల తవ్వకాలకు పాల్పడ్డ వి.ఎస్.లాడ్ అండ్ సన్స్ సంస్థలో సంతోష్ లాడ్ భాగస్వామిగా ఉన్నారనేందుకు గల ఆధారాలు, వి.ఎస్.లాడ్ సంస్థపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, సీఈసీ నివేదిక తదితర ఆధారాలను ఈ నివేదికలో పొందు పరిచినట్లు హీరేమఠ్ తెలిపారు. సంతోష్‌లాడ్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుందని, ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అక్రమ గనుల వ్యవహారంపై పోరాటం సాగించిన ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఇపుడు తన నివేదిక ఆధారంగా సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం తనకుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
15లోపు పనులు పూర్తి చేయండి : మేయర్
బెంగళూరు, న్యూస్‌లైన్ : మల్లేశ్వరం - యశ్వంతపుర మార్గంలోని సీఎన్‌ఆర్ సర్కిల్‌లోని అండర్‌పాస్ పనులను నవంబర్ 15 లోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను బీబీఎంపీ మేయర్ కట్టె సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆయన సీఎన్‌ఆర్ సర్కిల్ చేరుకుని అండర్‌పాస్ పనులు పరిశీలించారు. అనంతరం ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. మెట్రో రైలు అభివృద్ధి పనులు జరుగుతున్న చోట ఫుట్‌పాత్‌లు లేకపోవడంతో పాదచారులు ఇబ్బండి పడుతున్న విషయాన్ని గుర్తించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫుట్‌పాత్‌లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ వెంట పాలికె భారీ పనుల స్థాయీ సంఘం అధ్యక్షుడు సోమశేఖర్, కార్పొరేటర్ బీఆర్ నంజుండయ్య, అధికారులు ఉన్నారు.
ఆధారాలివిగో..లాడ్‌ను తప్పించండి
Published Wed, Oct 23 2013 3:41 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement
Advertisement