దక్షిణ భారత నటీనటుల సంఘం దీపావళి కానుక | Diwali gifts for South Indian Film Artistes' Association | Sakshi
Sakshi News home page

దక్షిణ భారత నటీనటుల సంఘం దీపావళి కానుక

Published Tue, Nov 3 2015 8:02 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM

Diwali gifts for South Indian Film Artistes' Association

చెన్నై : దక్షిణ భారత నటీనటుల సంఘం కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి బాధ్యతలు చేపట్టిన నూతన కార్యవర్గం సంఘం సభ్యులకు దీపావళి పండగ సందర్భంగా కానుక అందించాలని నిర్ణయించింది. కమలహాసన్, రజనీకాంత్ సహా 3500 మంది సభ్యులకు దీపావళి కానుకగా మగ వారికి పంచెలు, మహిళలకు చీరెలతో పాటు స్వీట్లు అందించనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో సంఘం కార్యవర్గం పేర్కొంది.

సంఘంలోని కార్యనిర్వాహక వర్గ సభ్యులను కొన్ని బృందాలుగా విభజించి తమిళనాడులోని అన్ని గ్రామాల్లోని నాటక కళాకారులను కలిసి వారి జీవన విధానాన్ని, ఆదాయ అంశాలను, ప్రస్తుత స్థితిగతులను తెలుసుకుని సంఘానికి నివేదించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దీపావళి పండగ తర్వాత ఆ కార్యక్రమం మొదలవుతుందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement