సాక్షి, ముంబై: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌కు ఎన్నికల దెబ్బ తగిలింది. ఓటు వేయాలన్న బాధ్యతతో నగర వాసులు పర్యాటక ప్రాంతాలను బుక్ చేసుకోలేదని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. సాధారణ రోజులతో పోలిస్తే బుధవారం 10 శాతం పర్యాటకులు మాత్రమే బుక్ చేసుకున్నట్లు సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. కార్లాలో రిసార్ట్స్, పాన్‌శెట్, మాథేరాన్, బహాబలేశ్వర్ లాంటి పర్యాటక ప్రాంతాలకు ఈ నెల 15వ తేదీన కేవలం 10 శాతం మాత్రమే బుక్ అయ్యాయన్నారు.
ఈ ప్రాంతాలు అటు పుణే వాసులకు ఇటు ముంబై వాసులకు ఎంతో ప్రాముఖ్యమైనవి. పర్యాటకుల స్పందన తక్కువగా ఉండడంతో ఎంటీడీసీ కొంతమేర నష్టపోయిందన్నారు. ఈ విషయమై ఎన్నికల అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఓటు హక్కు గురించి ప్రజల్లో అవగాహన పెరిగిందని, ఇది శుభపరిణామమని ఆనందం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో పుణే జిల్లాలోగల అన్ని రిసార్ట్స్‌లు అడ్వాన్స్‌గా బుక్ అయ్యాయని, ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి ఉందన్నారు. దీంతో పుణేలోని అన్ని రిసార్ట్స్ ఖాళీగా మారాయని ఎంటీడీసీ అధికారి సుభాష్ ఫడ్తారే తెలిపారు.
ఎంటీడీసీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. మహాబలేశ్వర్ రిసార్ట్స్‌లో 108 గదులు ఉన్నాయని, ఇందులో కేవలం 23 గదులు మాత్రమే (అక్టోబర్ 15న) బుక్ అయ్యాయని చెప్పారు. మరో ఫేవరెట్ పిక్నిక్ పాయింట్ అయిన కుర్లాలో ఎంటీడీసీ ఇటీవల ఖరీదైన రిసార్ట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో 73 గదులు ఉండగా 15వ తేదీన కేవలం ఎనిమిది గదులు మాత్రమే బుక్‌చేసుకున్నారని చెప్పారు. ఈ నెల 20, 30వ తేదీల్లో ఈ రిసార్ట్స్‌లలో ఎక్కువగా రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు.
సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రాల్ పార్టిసిపేషన్(ఎస్‌వీఈఈపీ) అధికారి యశ్వంత్ కన్కేడ్‌కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటు హక్కు విలువను తెలియజేయడం కోసం పుణే జిల్లాలో కనీసం 600 వీధి నాటకాలను నిర్వహించామన్నారు. దీని ఫలితమే ఓటర్లలో చైతన్యం పెరిగి, కాలక్షేపానికి విరామమిచ్చారని చెప్పారు.
పర్యాటశాఖకు ఎన్నికల దెబ్బ
Published Tue, Oct 14 2014 10:32 PM | Last Updated on Tue, Aug 14 2018 5:15 PM
Advertisement
Advertisement