పోలీసుల ఎన్‌కౌంటర్‌ను హత్య కేసుగా పరిగణించలేమని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించి న్యాయవాది పుగలేంది ఒ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని మద్రాసు హైకోర్టు తిరస్కరించింది.
సాక్షి, చెన్నై : పోలీసుల ఎన్‌కౌంటర్‌ను హత్య కేసుగా పరిగణించలేమని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. ఇటీవల దాదా దిండుగల్ పాండి, రౌడీ గూడువాంజేరి వేలు పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలి సిందే. ఇది ఎన్‌కౌంటర్ కాదు అని, ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా పే ర్కొంటూ, మద్రాసు హైకోర్టులో న్యాయవాది పుగలేంది పిటిషన్ దాఖలు చేశారు. ఎన్‌కౌంటర్ పేరుతో ఆ ఇద్దరిని హతమార్చిన పోలీసు అధికారులు నందకుమార్, మహేంద్రన్‌పై హత్య కేసు నమోదుకు ఆదేశించాలని విన్నవిం చారు. ఈ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి శివజ్ఞానం నేతృత్వంలోని బెంచ్ విచారిస్తూ వచ్చింది. వాదనలు, ప్రతివాదనలు ముగియడం తో విచారణ గురువారం ముగింపు దశకు చేరింది.
ఎన్‌కౌంటర్..హత్య కాదు:
పోలీసుల ఎన్‌కౌంటర్ అన్నింటిని హత్య నేరంగా పరిగణించలేమని ప్రధాన బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ కేసులో దిండుగల్ పాండి, వేలు వాహనాల్ని తనిఖీ చేసే యత్నంలో ఎదురు దాడి జరగడం, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపి ఉండడం స్పష్టం అవుతున్నదని బెంచ్ అభిప్రాయ పడింది. ఈ ఘటనపై ఆర్‌డీవో విచారణ నివేదిక, నిందితుల తరపు కుటుంబాల వాదన, సంఘటన స్థలంలో లభించిన ఆధారాలు అన్ని ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారికి వ్యతిరేకంగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్ని హత్య నేరంగా పరిగణించాలన్న పిటిషనర్ తరపున వాదనను తోసి పుచ్చుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఆర్‌డీవో దాఖలు చేసిన విచారణ నివేదికను పిటిషనర్ సైతం అంగీకరించి ఉన్నారని, అలాంటప్పుడు ఈ కేసు విచారణ అనవసరం అని, ఈ పిటిషన్ విచారణను ఇంతటితో ముగిస్తున్నామని ప్రక టించారు.
ఎన్‌కౌంటర్ హత్య కాదు
Published Fri, Sep 11 2015 3:03 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement
Advertisement