జనవరి1 న హత్య?
= పరారీలో నిందితులు
= న్యాయం జరిగే వరకూ కర్మకాండలు చేయం : కుటుంబ సభ్యులు
దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : నాలుగు రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కర్మ కాండలు జరపకుండా ఇంటి ముందే ఉంచుకుని న్యాయం కోసం మౌన పోరాటం చేస్తున్న సంఘటన బెంగళూరు గ్రామీణ జిల్లా దొడ్డబళ్లాపురం తాలూకా హెగ్గడిహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది.
జనవరి 1న హెగ్గడిహళ్లి గ్రామంలో మునేగౌడ, మురళి, మూర్తి, మునిస్వామి అనే నలుగురు స్నేహితుల మధ్య తాగిన సమయంలో తలెత్తిన చిన్న మనస్పర్ధలు గొడవకు దారి తీసి పర్యవ సాన ంగా దళిత వ్యక్తి మునిస్వామి(28) హత్యకు దారితీసింది. ఘటన జరిగిన రోజే మురళి, మూర్తి, మునేగౌడ ముగ్గురు వ్యక్తులు గ్రామం వదిలి పరారయ్యారు. నిందితుల చేతిలో దాడికి గురైన మునిస్వామి ఆదేరోజు అస్వస్థుడై ఇంటికి వచ్చి భార్య నాగమణి, తల్లి నారాయణమ్మ వద్ద తనపై దాడిచేసిన వారి పేర్లుచెప్పి ఇంట్లోనే కుప్పకూలి మరణించినట్టు మృతుడి తల్లి, భార్య చెబుతున్నారు.
మునిస్వామి మృతికి కారకులైన వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ దొడ్డబళ్లాపురం గ్రామీణ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేయకుండా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం పట్ల ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు మునిస్వామి మృతదేహానికి కర్మ కాండలు జరపకుండా జనవరి1 సాయంత్రం నుంచి ఇప్పటి వరకూ ఇంటి ముదే ఉంచుకుని మౌన పోరాటం చేస్తున్నారు. శవం నుంచి దుర్వాసన వస్తున్నప్పటికీ పట్టువదలని కుటుంబ సభ్యులు నిందితులను అరెస్టు చేసే వరకూ శవాన్ని తీసేది లేదని తేల్చి చెబుతున్నారు.
బాధితులకు గ్రామస్తులు, స్థానిక సంస్థలు మద్దతు తెలుపుతున్నారు. దీంతో విషయం ఆలస్యంగా మీడియాకు తెలిసింది. గ్రామీణ పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా బలగాలను మొహరింప జేశారు. ఘటనకు సంబంధించి న ూ్యస్‌లైన్‌తో మాట్లాడిన సీఐ శివారెడ్డి మృతుడి దేహంపై ఎటువటి గాయాలు లేకపోవడంతో హత్యగా పరిగణించలేక పోతున్నామని, అయినప్పటికీ అనుమానాస్పద మృతి గానే కేసు నమోదు చేశామన్నారు. శవానికి పోస్టుమార్టం నిర్వహించామని, నివేదిక అందాక దాన్నిబట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసారు.
మృతదేహంతో మౌన పోరాటం
Published Sun, Jan 5 2014 2:59 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement