Muni Swamy
-
ఔను.. చంపింది నేనే
చిత్తూరు అర్బన్: ‘ఔను.. జిల్లాలో రెండు హత్యలు, తమిళనాడులో ఆరు మర్డర్లు, ఎనిమిది హత్యాయత్నాలు చేశాను. పాలసముద్రంలో వళ్లియమ్మను ఇంటి వద్ద బండరాయితో చంపాను. దానికి ముందే నగరిలో రత్నమ్మను చంపేశాను’’ అని పోలీసుల అదుపులో ఉన్న సీరియల్ సైకో కిల్లర్ మునస్వామి పూస గుచ్చినట్లు వివరించాడు. చిత్తూరు పోలీసులు అతన్ని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. సోమవారం పాలసముద్రం, నగరి ప్రాంతాలకు తీసుకెళ్లారు. అతడు హత్య చేసిన తీరును కళ్లకుకట్టినట్లు పోలీసులకు వివరించాడు. ఇక తమిళనాడులోని షోలింగర్, బానావరం పోలీస్ స్టేషన్ల నుంచి సీఐలు చిత్తూరు చేరుకుని మునస్వామి నేర చరిత్రపై వివరాలను సేకరించారు. తమిళనాడులో ఎక్కడెక్కడ ఎప్పుడు ఎవర్ని చంపాడనే వివరాలను మునస్వామి వివరించాడు. అలాగే పదుల సంఖ్యలో చోరీలు, దొమ్మీల కేసుల్లో సైతం ఈ నరరూప రాక్షసుడి పాత్రను పోలీసులు గుర్తించారు. రూ.50ల కోసం హత్యలు చేయడం, అన్ని హత్యల్లోనూ 60కు పైబడ్డ వయస్సున్న వృద్ధుల్ని ఎంచుకోవడం, తలపై బండరాయి వేసి చంపడం, మృతుల శరీరంపై ఉన్న నగలు ముట్టుకోకపోవడం, చంపిన తరువాత మృతదేహాల లైంగిక అవయవాలను పళ్లతో కొరికి గాట్లు పెట్టడం ఈ సైకో కిల్లర్ నైజంగా పోలీసులు గుర్తించారు. మునస్వామి వాంగ్మూలాన్ని రికార్డుల్లో నమోదు చేశారు. మంగళవారం నిందితుడ్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. -
నాడొక పోలీస్ అధికారి.. నేడు తినడానిక్కూడా..!
-
కేపీ మునిస్వామికి జయ షాక్
మొన్న గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల నుంచి తొలగింపు తర్వాత కార్మికశాఖ కేటాయింపు తాజాగా ఆ శాఖ కూడా గోవిందా! హొసూరు న్యూస్‌లైన్: అన్నా డీఎంకే అధినేత్రి, సీఎం జయలలితకు ఎంతో విశ్వాసపాత్రుడిగా ఉన్న కృష్ణగిరి జిల్లా మంత్రి కేపీ మునిస్వామిపై వేటు పడింది. మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టిన జయలలిత ముగ్గురికి ఉద్వాసన పలికిన జయలలిత మరి కొందరి శాఖలను మార్చిన విషయం తెలిసింది. ముఖ్యమంత్రికి నమ్మకమైన వ్యక్తులుగా ఉన్న నల్గురు మంత్రులలో కృష్ణగిరి జిల్లా మంత్రి కే.పి మునిస్వామి ఒకరు. ఈయన కృష్ణగిరి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలను నిర్వహించేవారు. మంత్రి వర్గమార్పులతో కే.పి.మునిస్వామికి షాక్ ఇచ్చిన జయలలిత ఆయనను గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలను వెనక్కు తీసుకొని కార్మిక సంక్షేమశాఖను కేటాయించింది. మంగళవారం తాజా పరిణామాలు చోటుచేసుకోగా మునిస్వామిని కార్మిక శాఖనుంచి కూడాతొలగించారు. అదేవిధంగా పార్టీ కృష్ణగిరి జిల్లా కార్యదర్శి పదవినుంచి, పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడి పదవినుంచి కూడా ఆయనను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కృష్ణగిరి స్థానం నుంచి అన్నాడీఎంకె అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలుపొందించడంలో కేపీ మునిస్వామి కృషి ఉంది. అయితే ప్రతిష్టాత్మకమైన హొగేనకల్ పథకం అమలుపై ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టకపోవడం, కార్యకర్తలను, నాయకులను కలుపుకొని పోకపోవడం వల్లే ఆయనను మంత్రి పదవులకు దూరం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో కృష్ణగిరి జిల్లాలో కల్తీసారా దుర్ఘటనలో 42 మంది మృతి చెందినఘటనకు సంబంధించి నిందితుల వద్ద మంత్రి డ బ్బు తీసుకుని కేసు మాపీ చేయించినట్లు ఇటీవల ఓ తమిళవారపత్రికలో కథనం ప్రచురితమైంది. శాఖల తొలగింపునకు ఇది కూడా ఒక కారణమై ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
మృతదేహంతో మౌన పోరాటం
జనవరి1 న హత్య? = పరారీలో నిందితులు = న్యాయం జరిగే వరకూ కర్మకాండలు చేయం : కుటుంబ సభ్యులు దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : నాలుగు రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కర్మ కాండలు జరపకుండా ఇంటి ముందే ఉంచుకుని న్యాయం కోసం మౌన పోరాటం చేస్తున్న సంఘటన బెంగళూరు గ్రామీణ జిల్లా దొడ్డబళ్లాపురం తాలూకా హెగ్గడిహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. జనవరి 1న హెగ్గడిహళ్లి గ్రామంలో మునేగౌడ, మురళి, మూర్తి, మునిస్వామి అనే నలుగురు స్నేహితుల మధ్య తాగిన సమయంలో తలెత్తిన చిన్న మనస్పర్ధలు గొడవకు దారి తీసి పర్యవ సాన ంగా దళిత వ్యక్తి మునిస్వామి(28) హత్యకు దారితీసింది. ఘటన జరిగిన రోజే మురళి, మూర్తి, మునేగౌడ ముగ్గురు వ్యక్తులు గ్రామం వదిలి పరారయ్యారు. నిందితుల చేతిలో దాడికి గురైన మునిస్వామి ఆదేరోజు అస్వస్థుడై ఇంటికి వచ్చి భార్య నాగమణి, తల్లి నారాయణమ్మ వద్ద తనపై దాడిచేసిన వారి పేర్లుచెప్పి ఇంట్లోనే కుప్పకూలి మరణించినట్టు మృతుడి తల్లి, భార్య చెబుతున్నారు. మునిస్వామి మృతికి కారకులైన వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ దొడ్డబళ్లాపురం గ్రామీణ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేయకుండా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం పట్ల ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు మునిస్వామి మృతదేహానికి కర్మ కాండలు జరపకుండా జనవరి1 సాయంత్రం నుంచి ఇప్పటి వరకూ ఇంటి ముదే ఉంచుకుని మౌన పోరాటం చేస్తున్నారు. శవం నుంచి దుర్వాసన వస్తున్నప్పటికీ పట్టువదలని కుటుంబ సభ్యులు నిందితులను అరెస్టు చేసే వరకూ శవాన్ని తీసేది లేదని తేల్చి చెబుతున్నారు. బాధితులకు గ్రామస్తులు, స్థానిక సంస్థలు మద్దతు తెలుపుతున్నారు. దీంతో విషయం ఆలస్యంగా మీడియాకు తెలిసింది. గ్రామీణ పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా బలగాలను మొహరింప జేశారు. ఘటనకు సంబంధించి న ూ్యస్లైన్తో మాట్లాడిన సీఐ శివారెడ్డి మృతుడి దేహంపై ఎటువటి గాయాలు లేకపోవడంతో హత్యగా పరిగణించలేక పోతున్నామని, అయినప్పటికీ అనుమానాస్పద మృతి గానే కేసు నమోదు చేశామన్నారు. శవానికి పోస్టుమార్టం నిర్వహించామని, నివేదిక అందాక దాన్నిబట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసారు.