
నకిలీ దంపతుల అరెస్ట్
చెన్నై: అమెరికా వీసా పొందేందుకు దంపతులుగా నటించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోగల అమెరికా రాయబార కార్యాలయంలో వీసా పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారి దస్తావేజులను అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో గుజరాత్‌కు చెందిన ఏంజలిన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శంకర్ నకిలీ దస్తావేజులను అందజేసినట్లు తెలిసింది. వారు భార్య,భర్తగా నటించి వీసా పొందేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. దీంతో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.