ఉరివేసుకుని రైతు ఆత్మహత్య
Published Fri, Sep 16 2016 12:15 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక భూపాలపట్నానికి చెందిన మునిగాల అంజయ్య(48) అనే రైతు గ్రామశివారులో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు, ఆర్ధిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement