anjaiah
-
అన్ని కులాలకు మతాలకు అతీతంగా కేసీఆర్ పాలన్: అంజయ్య యాదవ్
-
సుపారీ ఇచ్చి.. హత్య చేయించి..
సాక్షి ప్రతినిధి, వరంగల్: జనగామ జిల్లా బచ్చన్నపేటలో హత్యకు గురైన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య (70) కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సుపారీ గ్యాంగ్ ఆయ నను అపహరించి, హత్య చేసిందని.. క్వారీ నీటి గుంటలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయిందని గుర్తించారు. భూముల వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, జనగామ జెడ్పీ వైస్ చైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి భర్త అంజయ్య ఈ హత్య కు సూత్రధారి అని తేల్చారు. ఈ మేరకు బచ్చన్నపేట, టా స్క్‌ఫోర్స్ పోలీసులు ప్రధాన నిందితుడు గిరబోయిన అంజయ్య, సుపారీ ముఠా సభ్యులు డోలకొండ శ్రీకాంత్, శివ రాత్రి బాషా అలియాస్ భాస్కర్లను అరెస్టు చేశారు. వారి నుంచి ఒక కారు, 3 సెల్ఫోన్లు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఇప్పటికే ఓసారి చంపేందుకు యత్నించి..: అంజయ్య కు సంబంధించి సర్వే నంబర్ 174లోని భూములపై వివా దాలు ఉన్నాయి. దీనిపై రామకృష్ణయ్య గతంలో అధికారు లకు ఫిర్యాదు చేశారు. దీనిపై కక్షగట్టిన అంజయ్య.. రామకృష్ణయ్యను హత్య చేయడానికి సిద్ధమయ్యాడు. 2022 జూలైలో జలంధర్ అనే వ్యక్తితో కలసి కారుతో ఢీకొట్టి చంపేందుకు విఫలయత్నం చేశాడు. ఇటీవల తనకు పరిచయమున్న దండుగు ల తిరుపతి అనే వ్యక్తితో రూ.8 లక్షలు సుపారీ ఇస్తానని, రా మకృష్ణయ్యను చంపాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీ నికి అంగీకరించిన తిరుపతి.. తనకు సమీప బంధువులైన డోలకొండ శ్రీకాంత్, శివరాత్రి బాషా, దండుగుల రాజులతో కలసి రామకృష్ణయ్య హత్యకు ప్లాన్ చేశాడు. పోచన్నపేట శివారులో కిడ్నాప్ చేసి..: తిరుపతి, శ్రీకాంత్, బాషా, దండుగుల రాజు నలుగురూ కలసి ఈ నెల 15న సాయంత్రం ఒక కారు అద్దెకు తీసుకుని పోచన్నపేట శివారులో మాటు వేశారు. బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తున్న రామకృష్ణయ్యను బలవంతంగా కారులోకి ఎక్కించుకొని, చిన్నరామన్చర్ల శివారుకు తీసుకువెళ్లారు. సుమారు 6.30 గంటల సమయంలో టవల్ మెడకు బిగించి రామకృష్ణయ్యను హత్య చేశారు. మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టుకుని.. ఓబూల్ కేశ్వాపూర్, పెద్దపహాడ్ల మీదుగా చంపక్ హిల్స్ ప్రాంతానికి వెళ్లి, అక్కడి ఓ క్వారీ నీటిగుంటలో పడవేశారు. హత్య జరిగే నాటికి అంజయ్య ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా రూ.2 లక్షల వరకు నిందితులకు ముట్టజెప్పాడు. ఒకటి కాదు రెండు హత్యలు!: రామకృష్ణయ్య హత్యకేసులో విచారణ జరుపుతున్న క్రమంలో మరో హత్య కేసు వెలుగులోకి వచ్చిందని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. అంజయ్య మరో భూవివాదంలో రూ. 2.5 లక్షల సుపారీ ఇచ్చి తన బావమరిది మల్లేశం భార్య సుభద్రను హత్య చేయించినట్టు వెల్లడైందని వివరించారు. 2022 అక్టోబర్ 20న ఆ హత్య జరిగిందని, ఆ ఘటనలోనూ తిరుపతి, రాజు హస్తం ఉన్నట్టు గుర్తించామన్నారు. 2012లో సుభద్ర భర్త మల్లేశం చనిపోయాడని.. తనకు రెండెకరాల భూమి రావాలని సుభద్ర నిలదీయడంతో అంజయ్య సుపా రి గ్యాంగ్‌తో హత్య చేయించాడని సీపీ వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి అంజయ్య సస్పెన్షన్ భూవివాదాలు, హత్య కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడు గిరబోయిన అంజయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ మండలాధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి ప్రకటించారు. అంజయ్య తొలి నుంచి బీఆర్ఎస్ కార్యకర్త కాదని, నాలుగేళ్ల కింద వేరే పార్టీ నుంచి వచ్చాడని పేర్కొన్నారు. -
రజకాభివృద్ధి సంస్థ వ్యవస్థాపకుడు అంజయ్య కన్నుమూత
కవాడిగూడ: టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, రజకాభివృద్ధి సంస్థ జాతీయ వ్యవస్థాపకులు డాక్టర్ ఎం.అంజయ్య (78) గుండెపోటుతో కన్నుముశారు. తీవ్ర అస్వస్థతకు గురైన డాక్టర్ ఎం. అంజయ్య బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఒంగోలు జిల్లాకు చెందిన డాక్టర్ ఎం.అంజయ్య రజకాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి ఉమ్మడి ఏపీలో అనేక కార్యక్రమాలను చేపట్టారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌తో దేశవ్యాప్త ఉద్యమం చేసి అసెంబ్లీలో తీర్మానానికి ఒత్తిడి తెచ్చారు. రజకాభివృద్ధి సంస్థ ఏర్పాటుతో పాటు, నిరుపేద రజకులకు ఇళ్లనిర్మాణం, దోబిఘాట్ల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. దివంగత వైఎస్ఆర్ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్‌గా నియమితులయ్యారు. ఆలిండియా సాయిసే వా సమాజ్ అధ్యక్షులుగా కొనసాగుతూ లోయర్ ట్యాంక్‌బండ్ ద్వారకా నగర్లో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. అంజ య్య మృతిపట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలు బీసీ, రజక సంఘాల నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. అనంతరం బన్సీలాల్‌పేట హిందూ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. -
కరోనా కాటు: సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ మృతి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అంజయ్య (54) కరోనా కాటుకు బలయ్యారు. ఆయనకు ఈనెల 13న కరోనా పాజిటివ్ రాగా.. హైదరాబాద్‌లోని ఓమ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. అదనపు కలెక్టర్‌గా పనిచేసిన ఆయన అనతికాలంలోనే మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఈయన స్వగ్రామం సూర్యా పేట జిల్లా జాజిరెడ్డిగూడెం. అంజయ్య మృతిపై మంత్రి కేటీఆర్, కలెక్టర్ కృష్ణభాస్కర్, జెడ్పీ చైర్పర్సన్ అరుణ సంతాపం తెలిపారు. కరోనాతో జేఎన్ఏఎఫ్ఏయూ మాజీ రిజిస్ట్రార్ మృతి విజయనగర్‌కాలనీ (హైదరాబాద్): జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ షేక్ రెహమాన్ పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. యూనివర్సిటీలో గతంలో ఫొటోగ్రఫీ హెచ్ఓడీగా విధులు నిర్వహించిన రెహమాన్ ప్రస్తుతం ప్లానింగ్ అకడమిక్ సేవలు అందిస్తున్నారు. రెహమాన్ మృతికి వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. కవితా దరియాణిరావు, వర్సిటీ సిబ్బంది సంతాపం తెలిపారు. -
సాగర్‌లో బీజేపీకీ షాక్..టీఆర్ఎస్లోకి బీజేపీ కీలక నేత!
గజ్వేల్: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వేడి ఊపందుకున్న వేళ మంగళవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ వేదికగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సాగర్ నుంచి బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ అసంతృప్త నేత కడారి అంజయ్య యాదవ్ వందలాది మంది అనుచరులతో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మీనర్సింహారెడ్డి, బాబురావు నాయక్, బొల్లి రాంచంద్రం, లింగాల పెద్దన్న తదితరులు టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ వారికి స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కడారి అంజయ్య విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నాయకత్వం యాదవులను విస్మరించేలా కుట్రలు చేయడం తనకు నచ్చలేదన్నారు. టీఆర్ఎస్లో శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రిగా నియమించడం, లింగయ్య యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశమివ్వడం, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తర్వాత ఆయన కుమారుడు భగత్‌కు టికెట్ ఇవ్వడం యాదవులపట్ల టీఆర్ఎస్ చిత్తశుద్ధిని తెలియ జేస్తోందన్నారు. బీజేపీలో యాదవులను అణచివేసే ధోరణి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే సమస్యలను పరిష్కరించు కోగలుగుతామన్న నమ్మకంతోనే టీఆర్ఎస్లో చేరినట్లు ప్రకటించారు. సాగర్‌లో నోముల భగత్ ఘన విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. టెయిల్ పాండ్ ప్రాజెక్టు, డిగ్రీ కళాశాల, రోడ్లు, మౌలికవసతుల కల్పనకు కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు కడారి వివరిం చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, రవీంద్రకుమార్ తదిరులు పాల్గొన్నారు. -
అంజయ్య శ్రీకారం.. వైఎస్ సాకారం
సాక్షి, కొవ్వూరు : రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టు. 1981 మే 21న అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య శంకుస్థాపన చేశారు. అప్పట్లో ఈ ప్రాంతానికి విచ్చేసిన సందర్భంలో కొవ్వూరు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద ఆయనకు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికినప్పటి చిత్రమిది. రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రి అంజయ్య అక్కడ నుంచి కారులో కొవ్వూరు చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎంఏ అజిజ్ ఆయనతో కలిసి కారులోనే ప్రయాణించి పోలవరం వెళ్లి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొవ్వూరుకు చెందిన కేఎన్ఎం ఖాన్సాబు, మాజీ పీసీసీ అధ్యక్షుడు జీఎస్ రావు, అప్పటి భారీ నీటిపారుదల శాఖామంత్రి జీవీ సుధాకర్, ఇంజినీరింగ్ చీఫ్ ఎంఎల్ స్వామి, పంచాయతీరాజ్ శాఖామంత్రి పరకాల శేషావతారం అంజయ్య వెంట ఉన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ కూడా దీనికి శంకుస్థాపన చేశారు. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో పోలవరం ప్రాజెక్ట్‌కు ఇందిరాసాగర్ అని నామకరణ చేసి రూ.10,151.05 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించారు. ముందు చూపుతో కుడి, ఎడమ ప్రధాన కాలువలను తవ్వించారు. వైఎస్సార్ హయాంలోనే సుమారు 80 శాతం కాలువల తవ్వకం పూర్తి చేశారు. ఈ కాలువలను వినియోగించి 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కృష్ణా, విశాఖకు గోదావరి నీరు తరలించేందుకు సన్నాహాలు చేసింది. ప్రాజెక్ట్ హెడ్‌వర్క్స్ పనుల్లో భాగంగా స్పిల్‌వే, ట్విన్ టన్నెల్స్, కుడి కనెక్టవిటీస్, ఎడమ కనెక్టవిటీస్ పనులను వైఎస్సార్ ప్రారంభించారు. నిర్వాసితుల పునరావాసంపై దృష్టి సారించారు. పోలవరం ప్రాజెక్టులో 194.60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు 960 మెగావాట్ల విద్యుత్ ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అవుతుంది. 24.33 టీఎంసీల నీటిని విశాఖలోని పరిశ్రమలకు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇన్నాళ్లు శంకుస్థాపనలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించిన వైఎస్సార్ చరిత్రలో నిలిచిపోయారు. -
అంజయ్య సతీమణి మణెమ్మ కన్నుమూత
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య సతీమణి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే టి.మణెమ్మ (75) ఆది వారం కన్నుమూశారు. ఆమెకు నలుగురు కుమార్తె లు, ఒక కుమారుడు ఉన్నారు. రక్తహీనత, జ్వరంతోపాటు మరికొన్ని అనారోగ్య సమస్యలతో ఆమె గత నెల 27న జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించి ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గత మూడేళ్లుగా వయోభారం, అనారోగ్యంతో మణెమ్మ ఇంటికే పరి మితమయ్యారు. ఆమె అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో జరుగుతాయని బంధువులు తెలిపారు. రాజకీయ ప్రస్థానం.. 1986లో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న భర్త టి.అంజయ్య మృతి చెందడంతో ఆ పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మణెమ్మ విజయం సాధించారు.1989లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రెండవ సారి ఎంపీగా తెలంగాణలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి ముషీరాబాద్ అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికల్లో మణెమ్మను నిలబెట్టి గెలిపించారు. అనంతరం 2009లో మళ్లీ ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీఎం కేసీఆర్ సంతాపం.. మణెమ్మ మృతి పట్ల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార లాంఛనాలతో మణెమ్మ అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కేసీఆర్ ఆదేశించారు. కాంగ్రెస్‌కు తీరని లోటు: ఉత్తమ్ మణెమ్మ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మణెమ్మ మృతి పట్ల సంతా పం ప్రకటించారు. మణెమ్మ మృతి పట్ల టీపీసీసీ కిసాన్‌సెల్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి కూడా సంతాపం ప్రకటించారు. హోంమంత్రి నాయిని, కెవీపీ రాంచందర్‌రావు, జానారెడ్డి, పొన్నాల, పి.శంకర్ రావు, మాజీ ఎంపీ కెఎస్.రావు, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి దంపతులు మణెమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌లు ఫోన్లో కుటుంబసభ్యులను పరామర్శించారు. వైఎస్ జగన్ సంతాపం.. సాక్షి, అమరావతి: మణెమ్మ మృతిపట్ల ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు వైఎస్ జగన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
అమ్మ, నాన్న.. ఓ ఆటో మామయ్య
రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్.. ఆటోవాలా జిందాబాద్! అమ్మో.. సిటీలో ఆటో ప్రయాణాన్ని ఇంతగా ఎంజాయ్ చేయగలమా..! మీటర్ వేయకుండా నోటికొచ్చినంత అడిగే ఆటోవాలాలు ఉన్నప్పుడు ఇలాంటి ఆనందం అసాధ్యమనకండి. ‘జిందాబాద్’ కొట్టాల్సిన వారూ ఉంటారు! ఇదిగో ఈ అంజయ్యలాగ. అంజయ్య ఆటోడ్రైవరే కాదు.. అమ్మానాన్నలు పంచే ప్రేమను పికప్ చేసుకొని పిల్లల దగ్గర డ్రాప్ చేస్తుంటాడు. స్కూల్లోని ఒత్తిడిని తగ్గించి టీచర్లు చెప్పే పాఠాలను ఫాలో అయ్యేలా చూస్తాడు. అతడి ఆటోలో స్కూలుకు వెళ్లే పిల్లలకు తల్లి, తండ్రి, టీచర్, గైడ్.. అంతకు మించి ఫ్రెండ్. అందుకే పిల్లలంతా ఆప్యాయంగా ‘మామయ్యా’ అని పిలుచుకుంటారు. ఇంతకీ ఈ ఆటోవాలా ఏం చేస్తాడు..! ఆటో అంజయ్య అంటే.. అందరికీ అభిమానమే.. ముఖ్యంగా చిన్నారులకు..ఉదయమే స్కూలుకెళ్లాలంటే పిల్లలుమారాం చేస్తారు.. అయితే అంజయ్య ఆటో కనపడగానే హ్యాపీగా వచ్చి ఆటోఎక్కేస్తారు.. అదీ ఆయన స్పెషాలిటి. సాక్షి, సిటీబ్యూరో: నెల్లుట్ల అంజయ్యది నల్లగొండజిల్లా. ఓ కెమికల్ కంపెనీలో ఉద్యోగం రావడంలో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. కాలక్రమంలో ఆ కంపెనీ లాకవుట్ అయ్యేసరికి ఉద్యోగం పోయింది. బతుకుదెరువు ప్రయత్నాల్లో కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో చేరాడు. కాని అవీ ఎక్కువకాలం సాగలేదు. ఒక క్రమబద్ధమైన పనికి అలవాటు పడిన అతనికి తర్వాత ఏం చేయాలో అర్థంకాలేదు. భార్య సలహా ఇచ్చింది.. ‘‘హైదరాబాద్‌లో ఆటో లాభసాటిగా సాగకపోయినా పొట్టకు, బట్టకు లోటుండదు ఆటో డ్రైవింగ్ నేర్చుకో’ అని. దీంతో సెకండ్ హ్యాండ్ ఆటో కూడా కొనేసుకున్నాడు. ఆ ప్రయాణం నల్లేరు మీద నడక కాదు గానీ నల్లని గతుకుల తారు మీద ఒడిదుడుకులుగానే వెళ్తొంది. పిల్లలు.. పెద్దలు అప్పటికే అంజయ్యకు ఇద్దరు పిల్లలు. ఒకపాప, బాబు. వాళ్లను తన ఆటోలో స్కూల్లో దింపుతుంటే తోటి ఆటో స్నేహితులు..‘‘ ఎట్లాగూ మీ పిల్లలను దింపుతున్నావ్ కదా.. స్కూల్ పిల్లలను మాట్లాడుకుంటే ఎంతోకొంత ఆదాయం వస్తుందికదా.. అని సూచించారు. అంజయ్యకూ నిజమే అనిపించింది. పైగా పిల్లలంటే తనకు చాలా ఇష్టం. ముందు కేంద్రీయ విద్యాలయలో చదివే ముగ్గురు పిల్లలను మాట్లాడుకున్నాడు. మూడునెలల్లో మచ్చికైపోయారు వాళ్లు. అంజయ్యతో ఇంట్లో మనిషితో కబుర్లు చెప్పినట్టే చెప్పేవారు. ఆ రోజు స్కూల్లో ఏం జరిగిందో.. టీచర్లు ఏం చెప్పారో పిల్లలను అడిగివాడు. వాళ్లు అంతే ఉత్సాహంగా అన్నీ చెప్పేవాళ్లు. పిల్లలను తీసుకెళ్తున్నప్పుడు ఆటో వేగాన్ని, తన ప్రవర్తనను ఎప్పుడూ హద్దు మీరనివ్వలేదు. ఈ మంచితనమే మౌత్‌పబ్లిసిటీ అయి మరింత మంది పిల్లలను స్కూల్లో దింపే ఆఫర్ వచ్చింది. నిజానికి ఉదయమే పిల్లల్ని స్కూల్లో దింపడంతో రోజు హుషారుగా మొదలయ్యేది. సాయంకాలం ఆ పిల్లలను ఇంట్లో దింపేటప్పుడు వాళ్లతో గడిపే ఆ సమయం.. ఆరోజు పడ్డ బడలికనంతా మాయం చేసేది. వెల్కమ్ అండ్ ఫేర్వెల్ అప్పుడే జాయిన్ చేసిన పిల్లలు, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు స్కూల్‌కి వెళ్లమని మారాం చేస్తారు. అసలు ఆటో ఎక్కడానికే మొండికేస్తారు. సముదాయించలేక తల్లులు సతమతమవుతుంటారు. అప్పుడు అంజయ్య అసలు వాళ్లను ఆటో ఎక్కిస్తే చాలు.. స్కూల్ వరకు వాళ్లే వస్తారు అనుకునేవాడు. దాంతో ఉదయమే వచ్చేటప్పుడు గుప్పిటి నిండా వాళ్లకిష్టమైన చాక్లెట్లను తెచ్చి ఏడుస్తున్న పిల్లలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచేస్తాడు. ఆ పిల్లలు ఆరునొక్కరాగం తీయకుండా ఎంచక్కా తయారై ఆటో ఎక్కేస్తారు. చాక్లెట్ చప్పరించేసరికి స్కూలూ వచ్చేస్తుంది. ఇలా మంచి చేసుకొని తల్లులనే మరిపించేయడం అంజయ్య ప్రత్యేకత. అదే ఆయన ఆప్యాయత. అంతే స్కూళ్లు మొదలవగానే ఫస్ట్‌డే పిల్లలందరినీ బేకరీకి తీసుకెళ్లి వాళ్లకు ఇష్టమైనవి కొనిపెడ్తాడు. అలాగే స్కూల్ లాస్ట్డే కూడా పానీపూరీ, పేస్ట్రీలు.. ఎవరికి ఏది నచ్చితే అది తినిపించి ఫేర్వెల్ ఇస్తాడు. ‘‘పిల్లలు లేని ఎండాకాలం రెండు నెలల సెలవులు నాకు బోరే! పిల్లలుంటేనే ఆటో సందడి.. నాకు సంబరం’’ అంటాడు అంజయ్య. సినిమాలు..సీరియళ్లు.. అంజయ్య ఆటో అంటే పిల్లలకు ఎంత ఇష్టమో.. తల్లిదండ్రులకు అంత భరోసా! ‘‘రోజూ వచ్చే టైమ్కన్నా ఆలస్యమైనా భయం ఉండదు. వచ్చేస్తారు.. అంజయ్య క్షేమంగా పిల్లల్ని దింపేస్తాడు అన్న థిలాసా.. ధీమా తప్ప’’ అంటారు తల్లిదండ్రులు. పిల్లలూ అంతే.. అంజయ్యను వదలరు. స్కూల్లో టీచర్ తిట్టినా.. ఇంట్లో అమ్మ కొట్టినా అంజయ్యకు చెప్పి.. బాధను పంచుకోవాల్సిందే.. బరువు దించుకోవాల్సిందే! అంజయ్య ఊరడిస్తుంటే హ్యాపీగా ఫీలవ్వాల్సిందే. అయితే పిల్లల కబుర్లు ఇక్కడితో ఆగవు... ఆ రోజు వాళ్లు చూసిన సీరియల్స్, పోగో చానల్‌లోని కార్టూన్ క్యారెక్టర్స్ నుంచి ఆ వీకెండ్లో మమ్మీడాడీతో కలిసి వెళ్లిన సినిమా స్టోరీ దాకా.. సాంతం అంజయ్యకు చెప్పాల్సిందే. లేకుంటే నిద్రపట్టదు. డ్రైవింగ్ మీద దృష్టిపెడుతూనే పిల్లల ముచ్చట్లకు ఊ కొట్టడం.. వాళ్లను ఉషారు పర్చడం 20 ఏళ్లలో అంజయ్యకు అలవడిన విద్య. ‘‘పిల్లలు కదా.. వినకపోతే చిన్నబోతరు. వాళ్లు కోరుకునేదీ అదే.. వాళ్లను వినడం.. వాళ్లను పట్టించుకోవడం. ఆటోలో స్కూల్‌పిల్లలను తీసుకెళ్లనంత వరకు నాకు ఇద్దరు పిల్లలే. ఇప్పుడు వీళ్లంతా నా పిల్లలే’’ అని ఆనందంగా చెప్తాడు ఆటోలో పిల్లలను చూపిస్తూ అంజయ్య. అతని ఆటోలో స్కూల్ కెళ్లిన చాలామంది పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్లై ఉద్యోగాలు చేస్తున్నవాళ్లున్నారు.. పెద్ద చదువుల కోసం యూనివర్శిటీల్లో చేరినవాళ్లూ ఉన్నారు. ‘‘మా స్టూడెంట్స్ ఫలానా అని టీచర్లు ఎంత గర్వంగా చెప్పుకుంటారో.. నాకూ అంతే గర్వంగా అనిపిస్తుంటుంది.. అరే..ఈ బాబును నా ఆటోల్నే తీసుకెళ్లిన.. ఈ పాప నా ఆటోల్నే స్కూల్కెళ్లేది అని గుర్తు చేసుకుంటుంటే. చాలా మంది పిల్లలు పెద్దవాళ్లై ఎక్కడెక్కడనో ఉన్నరు. నెలకు ఒక్కసారన్నా కాల్ చేసి మాట్లాడ్తారు. మంచిగనిపిస్తుంటుంది. డబ్బులు కావు.. ఇలాంటి జ్ఞాపకాలు మిగిల్తే చాలు అనిపిస్తుంటుంది. ఏం తీసుకపోతం పొయ్యేప్పుడు.. ఇలాంటి మంచి పేరు ఎప్పటికీ ఉంటది కదా’’ అంటాడు అంజయ్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ! నిజాయితీకి నిదర్శనం.. అంజయ్య తమ పిల్లలను స్కూల్లోకి తీసుకెళ్లి ఇంట్లో దింపే ఓ డ్రైవర్‌గా చూడనే చూడరు ఆ తల్లిదండ్రులు. తమ ఇంటిమనిషిలా గౌరవిస్తారు. ఏ ఫంక్షనైనా.. పండగైనా పిలుస్తారు. నిజాయితీ ఆయన నమ్మిన సూత్రం. ఒకసారి ఆయన ఆటోలో ఒక పెళ్లివాళ్లు షాపింగ్ వెళ్లారు. చీరలు, నగలు కొని మళ్లీ ఆయన ఆటోలోనే ఇంటికి చేరారు. నగల బ్యాగ్ సీట్ వెనకాల పెట్టారు. చీరల బ్యాగ్‌లు ఒళ్లో పెట్టుకొని ఇల్లు రాగానే వాటిని మాత్రమే తీసుకెళ్లిపోయారు వెనక బ్యాగ్ మరిచిపోయి. ఆ విషయం అంజయ్యకూ తెలీదు. ఇంతలో ఇంకో గిరాకీ రావడంతో వాళ్లను తీసుకుని వెళ్లాడు ఆయన. ఆ ప్యాసెంజర్స్ దిగిపోతూ ఎందుకో సీట్ వెనకాల చూసి.. ‘‘ఏదో బ్యాగ్ ఉందయ్యా.. ఎవరిదో మరి’’ అని చెప్పి వెళ్లిపోయారు. ఆ బ్యాగ్ ఇందాకటి పెళ్లివాళ్లది. నేరుగా ఆటోని దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు పోనిచ్చి ఆ బ్యాగ్‌ను అప్పజెప్పి ఎవరిదో కూడా చెప్పి వాళ్ల వివరాలు ఇచ్చి వచ్చేశాడు ఆటో స్టాండ్‌కి. ఈలోపే ఆ పెళ్లివాళ్లు వచ్చారు అంజయ్య దగ్గరకు వగరుస్తూ. ‘‘కంగారు పడకండీ.. మీ బ్యాగ్ ఎటూ పోలేదు. ఇందాకే పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చాను. పద తీసుకెళ్తాను’’ అని వాళ్లను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడు. ఆ బ్యాగ్‌లో 40 తులాల బంగారం ఉంది. అది తీసుకున్న పెళ్లి వాళ్ల ఆనందం అంతాఇంతా కాదు. అంజయ్యను మొక్కినంత పని చేశాడు. ‘‘ఇది నాకు మామూలే. చాలా మంది ఆటోలో ఎన్నో విలువైన వస్తువులు మర్చిపోతుంటారు. చాలా సార్లు వాళ్ల ఇంటికి వెళ్లి మరీ ఇచ్చిన సందర్భాలున్నాయి. చీపురుకట్టలతో సహా. పరాయి సొమ్ము పాములాంటిది. కష్టపడ్డ ఫలితం ఆవగింజైనా సరే అది మనది. ఒంటికి పడ్తుంది. మనది కానిది కోట్లలో వచ్చినా సరే.. కన్నెత్తి చూడొద్దు. ఇది మా పెద్దలు నేర్పిన నీతి. నా పిల్లలకూ నేను పంచింది ఇదే’’ అంటాడు అంజయ్య. ఒకరోజు ఒక చాట్ వ్యాపారి తన ఆటోలో గప్‌చిప్‌ల సంచీ మర్చిపోతే.. అతని అడ్రస్దొర్క ఆ సంచీని ఇంట్లోనే మూడు రోజులు పెట్టుకున్నాడు మానాన్న. ఆ గప్చిప్లేమో మమ్మల్ని ఊరిస్తున్నాయి. మనమే ఉంచుకుందాం నాన్నా వాటిని అని నేను, మా తమ్ముడు ఏడ్చినా.. మీకు వేరేవి కొనిస్తాను అని అన్నాడు తప్ప వాటిని ఇవ్వలేదు. మూడు రోజులకు అతని అడ్రస్ కనుక్కొని వెళ్లి ఇచ్చేసి వచ్చాడు’’ అని తమ చిన్ననాటి సంఘటను గుర్తు చేసుకుంది అంజయ్య కూతురు నిఖిత. అది ఆయన వ్యక్తిత్వం. ఆటోవాలా.. అంటే అన్యాయంగా మీటర్ తిప్పేవాడు కాదు.. ఆకాశన్నంటే బేరం చెప్పేవాడు అంతకన్నా కాదు! బరువు, బాధ్యత కోసం బతుకు బండీ లాగే మనలాంటి మనిషే!అందరూ కాకపోవచ్చు కొందరైనా ఇలాంటి వాళ్లున్నారు. ప్రయాణికులను భద్రంగా గమ్యం చేర్చేవాళ్లు! నిదర్శనం.. అంజయ్యే! అర్బన్ డైరీ పుటల్లో గుర్తుంచుకోవాల్సిన పేజీనే! అంకుల్‌కీ ఫేర్వెల్ ఇచ్చాం నేను చిన్నప్పటి నుంచీ అంకుల్ ఆటోలో వెళ్తున్నా. ఇప్పుడు నేను ఇంటర్ సెకండియర్. మేం టెన్త్‌లో ఉన్నప్పుడు లాస్ట్ వర్కింగ్ డే రోజు.. అందరం కలిసి అంకుల్‌కు ఫేర్వెల్ ఇచ్చాం. మళ్లీ అంకుల్ ఆటోలో వెళ్లలేం కదా. అది తల్చుకున్నప్పుడు ఆరోజు చాలా బాధనిపించింది. ఏడ్చేశాం కూడా! చాలా బాగుండేవాళ్లు. ఎన్నో జాగ్రత్తలు చెప్పేవాళ్లు. బాగా సరదాగా ఉండేది. – డి. సాహితి విసుక్కోడు ‘‘ఆటోలో చాలా అల్లరి చేస్తాం. అయినా అంకుల్ ఏమీ అనడు. వెళ్తూ వెళ్తూ ఏదైనా షాప్కనపడి మాకేమన్నా కావాలని అడిగితే ఆటో ఆపి కొనిస్తాడు. కాని ఎందుకు అని విసుక్కోడు. – చందు కోపం రాదు మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాడు. జాగ్రత్తగా దింపుతాడు. ఎన్ని కబుర్లు చెప్తామో.. ఎంత అల్లరి చేస్తామో! అయినా పాపం.. అంకుల్ అస్సలు కోపగించుకోడు. – చిక్కీ హాకీలో ప్రోత్సహించేవారు ఇప్పుడు నేను ఓ ఎమ్ఎన్సీలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నా. నైన్త్ క్లాస్ వరకూ అంకుల్ ఆటోలోనే వెళ్లాను. ఆయన మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. మాకు ఇంట్లో కానీ స్కూల్లో కానీ లేట్ అయినా అడ్జస్ట్ అయ్యేవారు. నాకు హాకీ అంటే చాలా ఇష్టం. దాంతో క్లాసెస్ అయ్యాక, హాకీ ఆడుతుండేవాణ్ని. అప్పుడు నాకు లేట్ అయ్యేది. అయినా అంకుల్ వెయిట్ చేసేవాళ్లు. ఆటోలో కూడా ‘ఎలా చదువుతున్నావ్?’, ‘హాకీ ప్రాక్టీస్ ఎలా జరుగుతోంది?’ అని అడిగి నన్ను ఎంకరేజ్ చేసేవాళ్లు. హి ఈజ్ వెరీ కూల్ పర్సన్. – రాజీవ్ -
ఉరివేసుకుని రైతు ఆత్మహత్య
చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక భూపాలపట్నానికి చెందిన మునిగాల అంజయ్య(48) అనే రైతు గ్రామశివారులో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు, ఆర్ధిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఊరు వెళ్లి వచ్చేసరికి.. ఇల్లు గుల్ల!
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాయిబాబానగర్‌లో తాళం వేసి ఉన్న ఇంటిని దొంగలు గుల్లచేశారు. బాధితుడి వివరాలివీ... కాలనీకి చెందిన అంజయ్య, కుటుంబసభ్యులతో కలసి ఇంటికి తాళం వేసి పదిరోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లారు. ఇది గమనించిన గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉంచిన రూ.40వేల నగదుతోపాటు రెండు తులాల బంగారం మూటగట్టుకున్నారు. పోతూపోతూ ఇంట్లోని సామానంతా ధ్వంసం చేశారు. శుక్రవారం రాత్రి ఊరి నుంచి తిరిగి వచ్చిన అంజయ్య కుటుంబసభ్యులు ఇంట్లో పరిస్థితి చూసి బోరుమన్నారు. బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య
రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో డీసీఎం బోల్తాపడిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. బుధవారం పరిగి సమీపంలో పెళ్లి బృందంతో వెళుతున్న డీసీఎం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అదే రోజు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా 25 మంది వరకు గాయాలపాలై హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో చేరారు. వారిలో మర్పల్లి మండలం మొగిలిగుండ్లకు చెందిన ఎస్.అంజయ్య(38) శుక్రవారం మృతి చెందాడు. మరో 15 మంది వరకు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుండగా... సుమారు పది మంది వరకు డిశ్చార్జ్ అయ్యారు. మద్యం మత్తులో ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ పరారు కాగా, అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
అమ్మా లేమ్మా.. నీళ్లు తాగమ్మా..
► పెళ్లి వేళ.. మృత్యు హేల ► వివాహానికి వెళ్తున్న వ్యాన్ బోల్తా.. ఏడుగురి దుర్మరణం ► 20 మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం ► రంగారెడ్డి జిల్లా పరిగి వద్ద ఘటన ► డ్రైవర్ మత్తుకు నిండు ప్రాణాలు బలి ► డ్రైవర్‌కు లెసైన్స్ కూడా లేదు ► తప్పతాగి నడపడంతోనే ప్రమాదం ► విషయం దాచి పెళ్లి జరిపించిన పెద్దలు ► పెళ్లయ్యాక ప్రమాదం గురించి తెలిసి బోరుమన్న వధూవరులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/పరిగి/కొందుర్గు: కాసేపట్లో పెళ్లి వేడుక.. అందరి ముఖాల్లో సంతోషం.. చిన్నారుల కేరింతలతో ఒకటే సందడి.. చిన్నాపెద్దా అంతా కలసి సంబరంగా వ్యాన్ ఎక్కారు.. కానీ బయల్దేరిన కాసేపటికే ఆ వాహనం మృత్యుకోరలకు చిక్కింది..! డ్రైవర్ ‘మత్తు’ ఏడుగురి నిండు ప్రాణాలను బలిగొంది!! పెళ్లికి చేరాల్సిన వారంతా మార్గం మధ్యలోనే పెను విషాదంలో మునిగిపోయారు. రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ పూటుగా తాగి వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలుకాగా.. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బయల్దేరిన కాసేపటికే.. వికారాబాద్ మండలం ద్యాచారం గ్రామానికి చెందిన అంజయ్య కూతురు శివలీలకు మహబూబ్‌నగ ర్ జిల్లా కొందుర్గు మండలం ఉత్తరాసిపల్లికి చెందిన రామరాజుతో పెళ్లి కుదిరింది. బుధవారం ఉదయం 10 గంటలకు వరుడి ఊరిలో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కూతురితో పాటు ఆమె తల్లిదండ్రులు మంగళవారం రాత్రే ఉత్తరాసిపల్లికి వెళ్లారు. మిగతా కుటుంబీకులు, బంధువులు దాదాపు 50 మంది డీసీఎం వ్యాన్‌లో బుధవారం ఉదయం 8.30కు ద్యాచారం నుంచి బయలుదేరారు. సయ్యద్‌పల్లికి చెందిన పొట్టిగారి సైదప్పను డ్రైవర్‌గా కుదుర్చుకున్నారు. ఆటో నడుపుతూ పొట్టబోసుకునే ఇతడికి డ్రైవింగ్ లెసైన్స్ కూడా లేదు. ఇటీవలే సొంతూరిలో వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి చేతిపంపును ఢీకొట్టాడు. పెళ్లి బృందాన్ని ఎక్కించుకోవడానికి ముందే ఇతడు మద్యం తాగాడు. ఇదే నిషాలో వాహనాన్ని ఇష్టానుసారంగా నడిపాడు. దారిలో అటుఇటుగా స్టీరింగ్‌ను తిప్పడంతో భయభ్రాంతులకు గురైన పెళ్లివారు అతడిపై కేకలు వేశారు. అయినా అవేవీ పట్టించుకోకుండా వాహనాన్ని మరింత వేగంగా నడిపాడు. దీంతో ఉదయం 10 గంటలకు వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ వాహనంలోంచి దూకి పరారయ్యాడు. ఘటనాస్థలంలో హాహాకారాలు.. ప్రమాదం అనంతరం క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ప్రమాద స్థలం పరిగికి సరిగ్గా కిలోమీటరు దూరంలో ఉంది. ప్రయాణికులు ఫోన్ చేయడంతో స్థానిక సీఐ, ఎస్సైలు చేరుకొని బస్సులు, అంబులెన్సులు, ఆటోలు.. ఏది అందుబాటులో ఉంటే అందులో క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో రాజు అనే తొమ్మిదేళ్ల బాలుడి కుడి చేయి తెగిపడింది. ఆ చేతిని పట్టుకొని బంధువులు తొలుత షాదాన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతులు వీరే.. ఘటనా స్థలంలోనే దోమ మండలం ఐనాపూర్‌కు చెందిన లక్ష్మి(35), చేవెళ్ల మండలం కుమ్మెరకు చెందిన అనసూయ (32) మృతి చెందారు. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో వికారాబాద్ మండలం కామారెడ్డిగూడకు చెందిన మన్నె మాణెయ్య(62), ద్యాచారానికి చెందిన నవీన్‌కుమార్(25) చనిపోయారు. మిగతా క్షతగాత్రులను హైదరాబాద్‌లోని షాదాన్, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. అక్కడ ద్యాచారం గ్రామానికి చెందిన బోయిన బుచ్చయ్య(60)తోపాటు అదే గ్రామానికి చెందిన శరణ్య(18), ధారూరు మండలం అంతారం నివాసి కావలి బుచ్చయ్య(75) మృతి చెందారు. సీఎం దిగ్భ్రాంతి రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, పరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, చేవె ళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవ్‌రావు తదితరులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా 50 వేల రూపాయలు, గాయపడిన వారికి 10 వేల రూపాయలు అందజేయాలని మంత్రి మహేందర్‌రెడ్డి ఈ సందర్భంగా కలెక్టర్‌ను ఆదేశించారు. అమ్మా లేమ్మా.. నీళ్లు తాగమ్మా.. అమ్మా.. లేమ్మా.. నీళ్లు తాగమ్మా.. లేచి మాట్లాడమ్మా.. అంటూ ఈ ఇద్దరు చిన్నారులు అపస్మారకస్థితిలో ఉన్న తమ తల్లి వద్ద రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రమాదంలో అక్కమ్మ(33) అనే మహిళ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. ఆమెను అంబులెన్సులో తీసుకువచ్చి పరిగి ఆస్పత్రి ఆవరణలో పడుకోబెట్టారు. క్షతగాత్రురాలి కొడుకు (రెండున్నరేళ్లు), కూతురు(4)కూ గాయాలయ్యాయి. తల్లికి ఏమైందో తెలియని.. ఆ చిన్నారులు ఆమె తల దగ్గర కూర్చుని ఏడవసాగారు. కొందరు వాటర్ ప్యాకెట్లు తీసుకొచ్చి చిన్నారులకు ఇచ్చారు. వారు నీటిని తాగుతూ.. ‘అమ్మా.. నువ్వూ తాగమ్మా..’ అంటూ త ల్లిని బతిమాలడం అందరినీ కలచివేసింది. అనంతరం అక్కమ్మను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. వెలవెలబోయిన పెళ్లి పందిరి ఈ ప్రమాదంతో ఉత్తరాసిపల్లిలో వరుడి ఇంట బంధువులు, బాజాబజంత్రీలతో కళకళలాడాల్సిన పెళ్లి పందిరి వెలవెలబోయింది. ఎవరి మొహం చూసిన విషాదమే కనిపించింది. పెళ్లి నిలిచిపోవద్దన్న ఉద్దేశంతో పెద్దలు ప్రమాదం విషయం దాచి పెళ్లి జరిపించారు. పెళ్లయ్యాక నూతన వధూవరులకు ప్రమాదం సంగతి చెప్పడంతో వారు బోరున విలపించారు. -
కరీంనగర్లో కొత్త సైకో
-
కరీంనగర్లో కొత్త సైకో
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో బుధవారం మరో సైకో హల్చల్ సృష్టించాడు. సుల్తానాబాద్ మండలం శాస్త్రీనగర్‌లో అంజయ్య అనే వ్యక్తి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. పిచ్చిచేష్టలతో ప్రజలపై దాడికి దిగడమే కాకుండా చేతిలో కర్ర పట్టుకుని వీరంగం వేస్తున్నాడు. గ్రామంలోని ఓ దుకాణంతో పాటు పలు వాహనాలపై దాడికి తెగబడడంతో పాటు అడ్డుకోబోయిన వారిపై దాడులు చేశాడు. దీంతో గ్రామస్థులు అతనిని చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అతని కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని గ్రామస్థులకు సర్ధి చెప్పారు. అతనికి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. దీంతో పోలీసుల సాయంతో అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజుల్లో జిల్లాలో ఇద్దరు సైకో దాడులకు తెగబడడంతో జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వడదెబ్బతో ఆరుగురు మృతి
ఆదిబట్ల: భానుడి ప్రకోపానికి మంగళవారం ఆరుగురు బలయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో జిల్లా పరిధిలో వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. ఇబ్రహీంపట్నానికి చెందిన నిదానకవి కిృష్టయ్య(65) రెండు రోజులుగా నగర పంచాయ తీ కార్యాలయం చుట్టూ పింఛన్ కోసం తిరుగుతున్నాడు. వడదెబ్బకు గురై సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఐదుగురు కుమారులు ఉన్నారు. పోచారంలో మరొకరు ..... మండల పరిధిలోని పోచారం గ్రామానికి చెందిన ఈర్లపల్లి అంజయ్య(38) రోజువారి కూలి. మంగళవారం పని నిమిత్తం ఇబ్రహీంపట్నానికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. ఈక్రమం లో ఆయన వడదెబ్బకు గురయ్యాడు. అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుం బీకులు ప్రభుత్వ ఆస్పత్రికితరలిస్తుం డగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. గండేడ్‌లో.. గండేడ్ : కూలికి వెళ్తున్న ఓమహిళ వడదెబ్బకు గురై మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని గాధిర్యాల్ గ్రామానికి చెందిన శీలం అంజమ్మ (32) భర్త మృతి చెందడంతో కొన్ని సంవత్సరాలుగా పుటింటిలోనే తల్లిదండ్రుల వద్ద నివసిస్తూ కూలి పనులకు వెళ్తుంది. రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురి కావడంతో మహమ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో సోమవారం చికిత్స చేయించుకుంది. రాత్రి 1.30 గంట సమయంలో అస్వస్థతకు గురైం ది. ఇది గమనించిన కుటుంబీకులు వెంటనే 108వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చె ందింది. శంకర్‌పల్లిలో.. శంకర్పల్లి: వడదెబ్బకు వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని పొద్దుటూర్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన నక్క ఎల్లమ్మ(70)కు సోమవారం మధ్యాహ్నం వడదెబ్బ తగిలింది. గ్రామంలోని ఆస్పత్రిలో చికిత్సచేయించుకుంది. మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. బహీరాబాద్‌లో.. బహీరాబాద్: మండల పరిధిలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనికి చెందిన సున్నిబాయి కుమార్తె స్వాతి(7) మంగళవారం వడదెబ్బకు గురై మృతి చెందింది. వార్డు సభ్యుడు రామునాయక్, నాయకులు బసప్ప కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొత్లాపూర్‌లో రైతు.. వడదెబ్బ తగిలి రైతు అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం ..మండల పరిధిలోని కొత్లాపూర్ గ్రామానికి చెందిన తుల్యానాయక్(45) వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం ధాన్యం పట్టించేందుకు బషీరాబాద్‌కు వ చ్చాడు. తిరిగి గ్రామానికి చేరుకున్న అతను కుప్పకూలి పోయాడు. స్థానికులు గమనించగా అప్పటికే మృతి చెందాడు. -
తీరు మారకపోతే సస్పెన్షనే : మంత్రి శిద్దా ఆగ్రహం
ఈ సారి చూసేది ఉండదు, సస్పెన్షనే అని రిమ్స్ డైరక్టర్ డాక్టర్ అంజయ్యపై మంత్రి శిద్దా రాఘవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్‌లో మెడికోల బాలికల వసతి గృహాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించకపోవడంతో శనివారం మెడికోలు నిరసన వ్యక్తం చేసిన ఘటనపై స్పందించిన మంత్రి రిమ్స్‌ను సందర్శించి నిప్పులు చెరిగారు. చేతకాకపోతే సెలవు పై వెళ్లిపోవాలని, పనిచేసే అధికారులు రిమ్స్‌కు వస్తారని హెచ్చరించారు. ఒంగోలు సెంట్రల్ : ‘రిమ్స్ పరిస్థితిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూశా.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వచ్చినప్పుడు చూశా. ఈసారి చూసేది ఉండదు.. సస్పెన్షనే అని రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ అంజయ్యపై రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్ కళాశాల విద్యార్థినుల వసతి గృహాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించకపోవడంతో శనివారం మెడికోలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మెడికోలను విచారించేందుకు మంత్రి ఆదివారం మధ్యాహ్నం రిమ్స్‌లోని బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నాలుగు రోజులుగా వసతి గృహాల్లో విద్యుత్ సౌకర్యం లేదని, మంచినీటి వసతి లేదని, శానిటేషన్‌కు తామే డబ్బులు చెల్లిస్తున్నామని..తాగుబోతులు వసతి గృహ పరిసరాల్లో సంచరిస్తున్నారని, రోడ్ల మీద లైట్లు లేక భయంతో ఉంటున్నామని మంత్రి దృష్టికి తెచ్చారు. మొత్తం 260 మంది బాలికలు వసతి గృహంలో ఉంటున్నామన్నారు. దీనిపై స్పందించిన మంత్రి.. రిమ్స్ డెరైక్టర్‌ను మందలించారు. ఏదో ఒక హెడ్ నుంచి నిధులు వెచ్చించి సమస్యలు పరిష్కరించాలన్నారు. బాలికల వసతి గృహానికి విద్యుత్ అంతరాయంపై మంత్రి ప్రశ్నించడంతో విద్యుత్ శాఖ డీఈ రామ్మూర్తి సమాధానమిస్తూ వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని..అండర్ గ్రౌండ్ కేబుల్‌ను తెప్పిస్తున్నామని చెప్పారు. విద్యుత్ పునరుద్ధరించడం కూడా చేతకాకపోతే ఎందుకు, సెలవుపై వెళ్లాలని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా లైన్ వేసి విద్యుత్‌ను పునరుద్ధరించాలని సూచించారు. అనంతరం రిమ్స్ ప్రాంగణంలోని ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడంతో మంచినీరు రావడం లేదని విద్యార్థినులు తెలపగా..దానికి స్పందించిన నిర్మాణ శాఖ డీఈ జగన్నాథరావు మాట్లాడుతూ ఆర్వో ప్లాంట్‌లో చిన్నచిన్న విడిభాగాలు విజయవాడ నుంచి త్వరలోనే తెప్పిస్తామన్నారు. దీనికి ఆగ్రహించిన మంత్రి విజయవాడ నుంచి తెప్పించడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందని ..ఉన్న అధికారులంతా సెలవుపై వెళ్లిపోవాలని..పనిచేసే అధికారులు రిమ్స్‌కు వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు తీసుకుంటూ పనిచేయకపోతే ఎట్లా..చేతకాకపోతే తప్పుకోండి అన్నారు. రిమ్స్‌లో శానిటేషన్, మంచినీటి వసతి లేదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి కూడా వైద్యం చేయడం లేదని, మందులు ఉండవని తనకు అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. శనివారం యాక్సిడెంట్ కేసులో రిమ్స్‌కు వచ్చిన క్షతగాత్రులకు రాజశేఖర్ అనే వైద్యుడు చికిత్స చేయకుండా ప్రైవేటు వైద్యశాలకు వెళ్లాలని ఉచిత సలహా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఒకరు మృతి చెందారని..దీనికి ఎవరిని బాధ్యులను చేయాలని ప్రశ్నించారు. రిమ్స్‌లో భవన నిర్మాణాలను డిసెంబర్ 3వ తేదీకల్లా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై హైదరాబాద్‌లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో సమావేశం నిర్వహించి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్లేట్లెట్ మిషన్ జిల్లాకు తెప్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రిమ్స్ డెరైక్టర్ మాట్లాడుతూ రిమ్స్‌కు రోజూ మూడున్నర లక్షల లీటర్ల నీరు అవసరమని..కార్పొరేషన్‌వారు ఆమేరకు సరఫరా చేయడంలేదని తెలిపారు. కొంత మేరకు పాత రిమ్స్ నుంచి పైపులైన్ల ద్వారా మంచినీటిని తెప్పిస్తున్నామన్నారు. మంత్రి వెంట ఆర్డీవో కమ్మ శ్రీనివాసరావు, తహశీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు, ఒంగోలు డీఎస్పీ, ఒన్‌టౌన్ సీఐ, ఎస్సై, వైద్యులు ఉన్నారు. -
చెల్లెల్ని వేధిస్తున్నాడని..బావ కాళ్లను కత్తితో నరికి
బావ కాళ్లను కత్తితో నరికిన బావమరిది పరిస్థితి విషమం గుడ్లూరు : చెల్లెల్ని వేధిస్తున్నాడని బావను చెట్టుకు కట్టేసి బావమరిది కత్తితో కాళ్లు నరికి వేయడంతో తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని పూరేటిపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన వెంకటమ్మకు శింగరాయకొండకు చెందిన అంజయ్యతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన అంజయ్య భార్య వెంకటమ్మను వేధిస్తున్నాడు. నాలుగు రోజులు క్రితం భార్యను కొట్టి పుట్టింటికి పంపించాడు. ఆదివారం ఉదయం శింగరాయకొండ నుంచి పూరేటిపల్లి వచ్చిన అంజయ్య బావమరుదులు చినకొండయ్య, శ్రీనివాసులుతో కలిసి మద్యం తాగి ఇంటికెళ్లాడు. అక్కడ కొండయ్య..‘మా చెల్లెల్ని ఎందుకు వేధిస్తున్నావు’ అని అడగటంతో ముగ్గురి మధ్య మాట మాట పెరిగి గొడవ పెట్టుకున్నారు. దీంతో అంజయ్యను ఇంటి ముందున్న వేప చెట్టుకు కట్టేసిన కొండయ్య ఇంటిలో ఉన్న మొద్దు కత్తిని తీసుకొచ్చి ఒక కాలును పూర్తిగా నరికేశాడు. రెండో కాలిపై, చేతులపై విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచాడు. అంజయ్య పెద్దగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దీంతో చిన కొండయ్య, శ్రీనివాసులు అక్కడి నుంచి పారిపోయారు. ఇంత గొడవ జరుగుతున్నా ఇంట్లోవారెవరూ వారిని అడ్డుకోకపోవడం గమనార్హం. నెత్తుటి మడుగులో భయానక పరిస్థితిలో ఉన్న అంజయ్య దగ్గరికెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై హుస్సేన్‌బాషాకు సిబ్బందితో కలిసి హుటాహుటిన గ్రామానికి చేరుకుని అప్పటికే అపస్మారక స్థితిలో రక్తపు మడుగులో పడి ఉన్న అంజయ్యను 108లో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నెల్లూరు తీసుకెళ్లారు. అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. రక్తం ఎక్కువగా పోవడంతో బతకడం కష్టమే అని వైద్యులు చెప్పినట్లు బంధువులు తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ మధుబాబు పరిశీలించారు. ఘటన వివరాలను అంజయ్య భార్య, అత్త, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హుస్సేన్‌బాషా తెలిపారు. -
ఓటమి విజయానికి తొలి మెట్టు
కడప ఎడ్యుకేషన్: విద్యార్థులు ఏవిషయంలోనైనా ఓటమి చెందామని మనస్తాపం చెందవద్దని, ఆ ఓటమే రేపటి విజయానికి తొలిమెట్టు అవుతుందని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కడప నగరం మరియాపురంలోని సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో మంగళవారం ఇన్స్పైర్ ముగింపు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డీఈఓ అంజయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను విద్యాశాఖ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఒకప్పుడు రత్నాల సీమగా ఉన్న రాయలసీమ నేడు రాళ్ల సీమగా మారిందన్నారు. విద్యార్థులు బాగా చదివి మంచి స్థాయికి ఎదిగి రాళ్ల సీమ పేరును రత్నాల సీమగా మార్చాలన్నారు. నేడు విద్యారంగం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ఎగ్జిబిట్స్ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలన్నారు. సంబంధిత కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. సంబంధిత విషయంలో తమవంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్రస్థాయిలో ఇన్‌స్పైర్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. డీఈఓ అంజయ్య మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఎంపికైన స్ఫూర్తితోనే రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలని సూచించారు. ఈ ప్రాజెక్టుల తయారీకి పిల్లల మేథాశక్తిని కొనియాడారు. పిల్లలు చదవుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఎదిగి దేశం పేరు నిలబెట్టాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక నూతన ఒరవడితో ముందుకు సాగాలన్నారు.డిప్యూటీ డీఈఓ రంగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మూడేళ్ల నుంచి నిర్వహిస్తున్న ఇన్స్పైర్ విజయవంతంగా నడుస్తోందన్నారు. ఇన్‌స్పైర్‌లో ప్రతి ప్రధానోపాధ్యాయుడు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించి పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలన్నారు. ప్రతి పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి దాని పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. వయోజన విద్య ఉపసంచాలకులు సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న చిన్న ప్రయోగాలతోనే విద్యార్థులకు ప్రేరణ వస్తుందన్నారు. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో 33 శాతం మంది విద్యకు దూరంగా ఉన్నారన్నారు. ఎంఈఓ నాగమునిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాల ఈ సైన్స్ ఫెయిర్‌లో పాల్గొనడానికి ముందుకు రావాలన్నారు. వీటితోపాటు ప్రైవేటు పాఠశాలలు కూడా పాల్గొనవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ ప్రసన్నాంజనేయులు, జిల్లా సైన్స్ అధికారి రెహ్మాన్, డీఈఓ కార్యాలయ ఏడీ సుబ్రమణ్యం, డీసీఈబీ సెక్రటరీ వెంకట రామిరెడ్డి, వైవీయూ అధ్యాపకులు వెంకట్రామ్, ఉస్మాన్, హెడ్మాస్టర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి, ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షులు రామచంద్రారెడ్డి, మరియాపురం స్కూలు సిస్టర్స్ శీల, లీలా రోజ్, పలు ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు రమణారెడ్డి, రమేష్‌రెడ్డి, సుబ్బారెడ్డి, లలితాభాయి, మేషక్బాబు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
రిమ్స్ తీరుపై మంత్రి గుస్సా
పనులు చేయకపోవడంపై ఆరాతీశారు. కాంట్రాక్టర్ జవాబుపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ.. ‘నేనేం అమాయకుడ్ని అనుకున్నావా..? రాష్ట్రంలో ఎక్కడా నువ్వు కాంట్రాక్ట్ చేయకుండా చేయగలను..’ అంటూ హెచ్చరించారు. రిమ్స్ ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ అంజయ్యతో మాట్లాడుతూ సదరు కాంట్రాక్టర్‌ను వెంటనే మార్చుకోవాలని ఆదేశాలిచ్చారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటాలని... ఆహ్లాదకరమైన వాతావరణంలో వైద్యం అందించడం ముఖ్యమని సూచించారు. అంతకుముందు నగరంలోని మాతాశిశు ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి అక్కడి సిబ్బందితో మంత్రి మాట్లాడారు. మధ్యాహ్నం నుంచి ఆయన కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లావైద్య, ఆరోగ్యంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రమాదకరమైన అనారోగ్య పరిస్థితులు ఒకప్పుడు ఒంగోలులోనే ఎక్కువగా కనిపించేవని.. అలాంటి వాతావరణం మార్చేందుకు వైద్యులు సేవాభావంతో పనిచేయాలని సూచించారు. రిమ్స్ ట్రామాకేర్ సిబ్బందితో పాటు 108, 104 సిబ్బందికి సకాలంలో జీతాలు అందిస్తామని.. రిమ్స్ బ్లడ్‌బ్యాంకు విస్తరణతో పాటు జిల్లాలో మిగతాచోట్ల ప్రతీ ఏరియా ఆస్పత్రిలోనూ బ్లడ్‌బ్యాంకు ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా నోడల్ అధికారులను నియమించి వారితో నిరంతర వైద్యసమీక్షలు చేయించే ప్రతిపాదనలున్నట్లు తెలిపారు. ప్రధానంగా అన్ని ఆస్పత్రుల్లో గైనిక్, ఎనస్థీషియా వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వైద్యులు ఆస్పత్రికి అందుబాటులో నివాసాలుండాలని.. విధులకు సకాలంలో హాజరుకాని వైద్యులపై కఠిన చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు. సాయంత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన మంత్రి త్వరలో జిల్లాల వారీగా జరగనున్న వైద్యరంగ అభివృద్ధిపై వివరించారు. ఆయనకు పలుచోట్ల వైద్యులు, ఇతర సిబ్బంది, ఐఎంఏ సభ్యులు సన్మానం చేశారు. మంత్రి పర్యటనలో డీఎంఏ డాక్టర్ జి. శాంతారావు, కలెక్టర్ విజయ్‌కుమార్, జేసీ యాకూబ్‌నాయక్, మెడికల్ ఆర్డీ శాలినిదేవి, జిల్లావైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ చంద్రయ్య, వైద్యవిధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ దుర్గాప్రసాద్, రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ అంజయ్య తదితరులున్నారు. ఆస్పత్రికి వచ్చేవారిని వేధించొద్దు ఒంగోలు టౌన్: ‘పేషంట్ దేవుడి లాంటివాడు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చేవారిని వేధించొద్దు. వారిని ప్రేమగా పలకరించాలి. ఆప్యాయంగా చూసుకోవాలి. ఈ రెండు చేస్తే ఆ రోగి సగం జబ్బు తగ్గుతోంది. మిగిలిన జబ్బును మనం ఇచ్చే వైద్యం ద్వారా తగ్గుతోంది. పేషంట్ లేకపోతే మనం లేమన్న విషయాన్ని గుర్తెరిగి విధులు నిర్వర్తించాలని’ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రభుత్వ వైద్యులకు ఉద్బోధించారు. ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ వైద్యులతో బుధవారం సాయంత్రం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూర్వం వైద్యులను దేవుడిలాగా చూసేవాళ్లని, మనం దానిని నిలబెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నూటికి తొంభై శాతం పేదలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుంటారని, మన పద్ధతులను మార్చుకొని ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. సమాజం ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లేనని, ఆరోగ్యంగా లేకుంటే మనం ఆరోగ్యంగా లేనట్లేనని వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశంలో శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని నిరోధించేందుకు మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే లేని జబ్బులు వస్తాయని ప్రజల్లో భయం ఉందని, అందుకు కారణం అక్కడ ఉండే అపరిశుభ్రతేనన్నారు. పారిశుధ్యం మెరుగుపరిచే కాంట్రాక్టు పొందినవాళ్లు సక్రమంగా పనిచేయకుంటే ఒకసారి వార్నింగ్ ఇవ్వాలని, అప్పటికీ మారకుంటే మెమో ఇవ్వాలని, పరిస్థితిలో మార్పురాకుంటే వారుకట్టిన డిపాజిట్ తిరిగి ఇవ్వొద్దని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు పేరు ఒక్కటే మిగిలి ఉందని, మిగతాదంతా కొత్తేనన్నారు. వైద్యులంతా మరింత కష్టపడి ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చాలని మంత్రి కామినేని కోరారు. ‘సిక్’ అయితే ఎంత నష్టమో గుర్తించాలి - కొండపి ఎమ్మెల్యే ఒక వ్యక్తి సిక్ అయితే ఎంత నష్టం జరుగుతుందో వైద్యులు గుర్తించాలని కొండపి శాసనసభ్యుడు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కోరారు. ఇంటి యజమాని సిక్ అయితే ఆ కుటుంబమంతా ఆ రోజు ఆదాయం కోల్పోతుందని, విద్యార్థి సిక్ అయితే ఆ రోజు పాఠాలు కోల్పోతాడన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది తాము తీసుకుంటున్న జీతాలకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్యం సరిగా లేకపోతే దానికి అందరూ బాధ్యులేనన్నారు. జిల్లాలోని ప్రభుత్వ వైద్యులతో ప్రతినెలా క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయన్నారు. క్లస్టర్ల వ్యవస్థ వల్ల సమస్యలు ఏర్పడటం తప్పితే ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమిస్తే బాగుంటుందని సూచించారు. పీహెచ్‌సీని బ్రాందీ షాపుగా మార్చేశారు - కనిగిరి ఎమ్మెల్యే కనిగిరి నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బ్రాందీ షాపుగా మార్చేశారని ఎమ్మెల్యే కదిరి బాబూరావు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 15 పడకల ఆస్పత్రికి ఇన్చార్జి వైద్యుడు ఉన్నప్పటికీ నాలుగేళ్ల నుంచి బ్రాందీ షాపు నడుస్తూనే ఉందన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తరువాత ఎక్సైజ్ సీఐతో దానిని ఖాళీ చేయించినట్లు తెలిపారు. సీఎస్‌పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారని, ఆయన కూడా ఇన్చార్జేనని, గట్టిగా రమ్మంటే రిజైన్ చేస్తానంటున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉంటే అన్నిచోట్ల ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నారన్నారు. పేరుకు ఆస్పత్రులు ఉన్నా అవి సరిగా పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పామూరులోని 30 పడకల ఆస్పత్రి కబ్జాకు గురైనట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు, డీఎంఈ శాంతారావు, కలెక్టర్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్, వైద్య ఆరోగ్యశాఖ ఆర్డీ శాలినీదేవి తదితరులు పాల్గొన్నారు. -
'ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపారు'
హైదరాబాద్: అసత్య హామీలతో చంద్రబాబు నాయుడు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపారని, ఇప్పుడు ఆ హామీలను దాటవేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రోజా, విశ్వేశ్వర్ రెడ్డి, ఐజయ్య విమర్శించారు. పంటల రుణమాఫీ, 9 గంటల ఉచిత విద్యుత్ హమీల అమలుపై ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించలేదన్నారు. కేంద్రం, ఆర్బీఐపై నెపం మోపుతూ రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ అమలుపై కార్యాచరణ ప్రకటించకుండా కోటయ్య కమిటీ ఎందుకు వేశారని ప్రశ్నించారు. రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయనని, రుణమాఫీ అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
నాడు అంజయ్య.. నేడు కేసీఆర్
మెదక్ : నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మెదక్ జిల్లా నుంచి టంగుటూరి అంజయ్య ఎన్నిక కాగా, నేడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఇదే జిల్లాకు చెందిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎన్నిక కాబోతున్నారు. దేశ, రాష్ట్ర రాజకీయ యవనికపై మెతుకుసీమ ప్రతినిధులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1980లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికైన ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా కొనసాగారు. అలాగే 1981లో ఇదేజిల్లా రామాయంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన టంగుటూరి అంజయ్య ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1989లో నర్సాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన జగన్నాథరావు ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం 2009లో ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన దామోదర రాజనర్సింహ కూడా ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్ త్వరలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. -
నాడు అంజయ్య.. నేడు హనుమన్న
కాంగ్రెస్ పార్టీ, అందులోనూ గాంధీ కుటుంబం ప్రతిసారీ తెలుగు నాయకులను, పార్టీకి వీర విధేయులుగా ఉన్నవాళ్లను తీవ్రంగా అవమానిస్తూనే ఉంది. పదహారణాల కూలీని అని గర్వంగా చెప్పుకొన్న ముఖ్యమంత్రి అంజయ్యను బేగంపేట విమానాశ్రయంలో అప్పటికి ప్రభుత్వంలో ఎలాంటి పదవీ లేని రాజీవ్ గాంధీ తోసి పారేసిన సంఘటన గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ అదే కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న వి.హనుమంతరావు (వీహెచ్)కి కూడా సరిగ్గా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను, ఎంపీనని చెప్పినా రాహుల్ గాంధీ పాల్గొంటున్న సభా వేదికపైకి ఆయనను పంపడానికి పోలీసులు నిరాకరించారు. ఎల్బీస్టేడియంలో రాహుల్ సభ వద్ద వీహెచ్‌కు అవమానం జరిగింది. వేదికపైకి అనుమతి నిరాకరించడంతో వీహెచ్ కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు వీహెచ్‌ను అనుమతించకపోవడంతో ఆయన ఆగ్రహంతో అక్కడి నుంచి తప్పుకొని, ఓ పక్కన మౌనంగా నిలబడిపోయారు. రాహుల్ గాంధీయే తలచుకుంటే వీహెచ్ లాంటి నాయకులకు వేదికపైకి అనుమతి లభించడం పెద్ద కష్టం కాదు. కానీ, రాహుల్ ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని వీహెచ్ అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి గాంధీ కుటుంబంలో దాదాపు ప్రతి ఒక్కరికీ వీహెచ్ బాగా పరిచయం అని చెబుతారు. అంత సన్నిహిత సంబంధాలున్న నాయకుడిని కూడా ఇప్పుడు కూరలో కర్వేపాకులా తీసి పక్కన పారేశారంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
విద్యుత్ కోసం రైతుల రాస్తారోకో
నర్సాపూర్ రూరల్, న్యూస్‌లైన్ : వ్యవసాయానికి ఏడు గంటల పాటు నిరంతరాయంగా సరఫరాతో పాటు లో ఓల్టేజీ సమస్యను తీర్చాలని సోమవారం మండలంలోని కాజీపేట, మంతూరు, రెడ్డిపల్లి గ్రామాల రైతులు నర్సాపూర్ - మెదక్ రహదారిలోని రెడ్డిపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. అంతకుముందు సబ్‌స్టేషన్‌లో ఉన్న లైన్ ఇన్స్పెక్టర్ అంజ య్యతో పాటు లైన్మన్లు రాంలు, టీ వేణు, సబ్‌స్టేషన్ ఆపరేటర్ దశరథ్ను ఓ గదిలో నిర్బంధించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో రాత్రీపగలు కలిపి దశలవారీగా సుమారు ఐదు గంటలు సరఫరా చేసేవారని, అయితే వారం రోజులుగా కేవలం రెండు మూడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోందని వాపోయారు. సరఫరా అవుతున్న విద్యుత్‌లో ఎక్కువ భాగం లో ఓల్టేజీతో సరఫరా అవుతోందని తెలిపారు. దీంతో వారం రోజులుగా మంతూరు, కాజీపేట, గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందన్నారు. వ్యవసాయ పంటలు దాదాపు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారించాలని విద్యుత్ శాఖ ఏడీతో పాటు ఏఈలకు పలుమార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై లైన్ ఇన్స్పెక్టర్తో పాటు లైన్మన్లను వివరణ కోరగా రెడ్డిపల్లి ఫీడర్ కెపాసిటీ కన్నా ఎక్కువ వినియోగం ఉండడంతో లో ఓల్టేజీతో పాటు తరచూ సబ్‌స్టేషన్‌లో ట్రిప్ కావడం జరుగుతోందన్నారు. రైతులు సమస్యల ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనన్నారు. అయితే తమ చేతిలో ఏమీ లేదన్నారు. ఇదిలా ఉండగా.. విషయం తెలుసుకున్న ఎస్ఐ కోటేశ్వరరావు అక్కడికి చేరుకుని ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతులు లేకుండా రాస్తారోకోలు చేయకూడదని రైతులకు సూచిం చారు. సమస్యలుంటే అధికారుల వద్దకు వెళ్లి చెప్పుకోవాలన్నారు. రైతులు తమ పరిస్థితులను వివరిస్తుండగా.. ఓ కానిస్టేబుల్ మొబైల్లో రాస్తారోకో ఫొటోలను తీశారు. అప్పటి వరకు ట్రాన్స్‌కో అధికారుల తీరును ఎండగట్టిన రైతులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా.. అనుమతులు లేకుండా రాస్తారోకో చేసినందుకు, అధికారులను నిర్బంధించిన విషయంలో ఆరుగురు రైతులు, మరో కొంతమందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
హెడ్మాస్టర్ సస్పెన్షన్
చక్రాయపేట, న్యూస్‌లైన్: కీచక హెడ్మాస్టర్ కృష్ణానాయక్‌ను డీఈఓ అంజయ్య సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చారు. చక్రాయపేట మండలం మహదేవపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కృష్ణానాయక్ తోటి ఉపాధ్యాయురాలి పట్ల, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై వారు ఆదివారం పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆదివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థులు బైఠాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కృష్ణానాయక్‌ను సస్పెండ్ చేస్తామని డీఈఓ ఆదివారం విద్యార్థుల వద్దకు వచ్చి హామీ ఇచ్చారు. కాగా సోమవారం విద్యార్థులు పాఠశాలకు మధ్యాహ్నం వరకు తాళాలు వేసి బయటనే కూర్చున్నారు. హెడ్మాస్టర్పై చర్యలు తీసుకునేంతవరకూ పాఠశాల తలుపులు తీయమని విద్యార్థులు తెగేసి చెప్పారు. మధ్యాహ్నం హెడ్మాస్టర్ను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు మండల విద్యాకేంద్రానికి వచ్చాయని ఆ పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు చెప్పినా వారు వినలేదు. దీంతో ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు ఎమ్మార్సీ కార్యాలయం వద్దకు వచ్చి సస్పెన్షన్ ఉత్తర్వులు తీసుకెళ్లి విద్యార్థులకు చూపించడంతో వారు కేకలు వేస్తూ తరగతి గదుల్లోకి వెళ్లారు. కృష్ణానాయక్‌ను రిమాండ్‌కు తరలింపు... హెడ్మాస్టర్ కృష్ణానాయక్‌ను సోమవారం లక్కిరెడ్డిపల్లె మేజిస్ట్రేట్ కోర్టుకు తరలించి నట్లు ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆయన్ను రాయచోటి సబ్‌జైల్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
రిమ్స్ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: రిమ్స్ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లను సోమవారం రిమ్స్ డెరైక్టర్ అంజయ్య ప్రారంభించారు. మొదటి అడ్మిషన్‌ను శ్రీకాకుళానికి చెందిన విద్యార్థినికి డెరైక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక రిమ్స్ డెరైక్టర్ చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంజయ్య మాట్లాడుతూ 2013-14 సంవత్సరానికి నర్సింగ్ కాలేజీలో జీఎన్ఎం కోర్సుకు 60 మంది విద్యార్థులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. నవంబర్ 24న విశాఖపట్నం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ అధ్యక్షతన గల కమిటీ విద్యార్థులను ఎంపిక చేసిందని చెప్పారు. రిమ్స్‌లో ప్రవేశం పొందిన 60 మందిలో 51 మంది విద్యార్థినులని, 9 మంది విద్యార్థులని తెలిపారు. మూడున్నరేళ్ల వ్యవధి కలిగిన ఈ కోర్సులో 6 నెలల పాటు మిడ్వైఫరీ శిక్షణను అభ్యర్థులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. నర్సింగ్ కళాశాలకు అధ్యాపకులను నియమించినట్లు చెప్పారు. విద్యార్థినీ, విద్యార్థులకు తరగతి గదలు, లైబ్రరీ, అదే విధంగా వేరు వేరుగా హాస్టల్ వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా *10 కోట్ల నిధులు మంజూరు చేశారని, కానీ విడుదల చేయలేదన్నారు. దీనిలో కేంద్ర ప్రభుత్వ వాటా 85 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 15 శాతం ఉంటుందన్నారు. మొదటి సంవత్సరం నర్సింగ్ విద్యకు నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు అనుమతులు మంజూరు చేశారన్నారు. మరో రెండు సార్లు ఎన్.సి.ఐ తనిఖీలు ఉంటాయని చెప్పారు. ఈ తనిఖీల్లోపు నర్సింగ్ భవనాలు కూడా పూర్తి చేయాలన్నారు. నర్సింగ్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా రాజ్యలక్ష్మిని, వైస్ ప్రిన్సిపాల్ గా కృష్ణవేణిలను నియమించినట్లు తెలిపారు. రిమ్స్‌లో డైట్ కాంట్రాక్టర్‌ను డిస్మిస్ చేశామని, త్వరలో నూతన కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పారిశుధ్య కాంట్రాక్టుపై జనవరిలో హైదరాబాద్‌లో నిర్ణయం తీసుకుంటారని, త్వరలో 150 మంది పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులు, వైద్యకళాశాల, వైద్యశాలకు నియమితులవుతారన్నారు. వీటితో పాటు 50 మంది సెక్యూరిటీ గార్డులను ఎంపిక చేస్తామన్నారు. అదే విధంగా ఎంబీబీఎస్ విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ అందజేసేందుకు * 10 లక్షలతో నిధిని ఏర్పాటు చేశామన్నారు. ఇంకా దాతలు స్పందించాలని కోరారు. 4 నెలలుగా ప్రొఫెసర్లకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. విలే కరుల సమావేశంలో రిమ్స్ మెడికల్ డిపార్టుమెంట్ హెచ్ఓడీ డాక్టర్ మల్లికార్జునరావు, ఆరోగ్య శ్రీ ఇన్చార్జి డాక్టర్ కె.సి.టి నాయక్, ఎ.పి.ఐ.ఎం.డి.సి ఇంజినీర్ టి.రవి తదితరులు పాల్గొన్నారు. -
విద్యావంతుడి విషాదాంతం
మంచాల, న్యూస్‌లైన్: ‘చదువుకున్నోడు, శాస్త్రవేత్త కావాల్సిన నా బిడ్డ శవమై వచ్చాడు..అయ్యో మాకేంటి ఈ గతి?’ అంటూ వెంకటేష్ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. వారిని ఓదార్చడం బంధువుల తరంకాలేదు. ఆదివారం నగరంలోని సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి వెంకటేష్ బలవన్మరణంతో స్వగ్రామం మంచాల మండలం లింగంపల్లి శోకసంద్రమైంది. గ్రామానికి చెందిన మాదారి అంజయ్య, వెంకటమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అంజయ్య రిటైర్డ్ ఏఎస్ఐ. వెంకటమ్మ గృహిణి. వీరి రెండో కుమారుడు వెంకటేష్(25) చురుకైన విద్యార్థి. ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచే అహర్నిషలు శ్రమించేవాడు. నగరంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మీడియట్, డిగ్రీ పూర్తి చేశాడు. ఎంబీబీఎస్‌కు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని కొద్ది మార్కుల తేడాతో డాక్టర్ చదవలేకపోయాడు. దీంతో ఆయన జేఎన్టీయూలో పీజీ చదివాడు. అనంతరం సెంట్రల్ యూనివర్సిటీలో బయో కెమెస్ట్రీలో పీహెచ్‌డీలో చేరి ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్నాడు. తరచూ తనను గైడ్ రవి వేధిస్తున్నాడని వెంకటేష్ కుటుంబీకులతో చెబుతుండేవాడు. కాగా గ్రామంలో ఆదివారం రాత్రి వెంకటేష్ అంత్యక్రియలు నిర్వహించారు. శోకసంద్రమైన లింగంపల్లి.. వెంకటేష్ మృతితో కుటుంబీకులు, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఉన్నత లక్ష్యానికి చేరుకుంటాడనుకున్న వెంకటేష్ బలవన్మరణానికి పాల్పడడం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం ఉదయం తనకు జేఎల్(జూనియర్ లెక్చరర్) పరీక్ష ఉందని, సెంటర్ వరకు తీసుకెళ్తానని చెప్పిన తమ్ముడు వెంకటేష్ అంతలోనే విగత జీవి అయ్యాడని అక్క రాణి గుండెలుబాదుకుంది. వెంకటేష్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
అధికారులు ఏం చేస్తున్నారు?
బీర్కూర్, న్యూస్‌లైన్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా అధికారులు ఏం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మండల స్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా తహశీల్ కార్యాలయాన్ని సందర్శించి, ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. మండలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల పథకం ఎంతవరకు వచ్చిందని ఉపాధి హామీ అధికారులను ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం కలెక్టర్ పొతంగల్ గ్రామం నుంచి బీర్కూర్ గ్రామానికి రాగా, రోడ్లు అధ్వానంగా ఉండడంతో స్థానిక తహశీల్దార్ అంజ య్యపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోడ్లు ఇలా ఉం టే వాహనాలు ఎలా వస్తాయన్నారు. వారంలో ఒకరోజు ‘ఇందిరమ్మ ఇళ్ల’కు ఇసుక మండలంలోని బరంగేడ్గి గ్రామం నుంచి రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్థానిక తహశీల్దార్‌ను పిలిపించి, ఇసుక రవాణా జరుగుతుంటే పట్టించుకోవడం లేదా అని ప్రశ్నించారు. వెంటనే ట్రాక్టర్లు సీజ్ చేయాలని ఆయన ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు వారంలో ఒక రోజు ఇసుక తీసుకువెళ్లడానికి అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. దోషులను గుర్తించారా...? మండలంలోని బరంగేడ్గి గ్రామంలోని పాఠశాలలో విషపు గుళికలు కలిపిన సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించారా అని ఎంఈఓ గోపాల్‌రావును కలెక్టర్ ప్రద్యుమ్న ప్రశ్నించారు. దీనిపై పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారని ఎంఈఓ బదులిచ్చారు. అనంతరం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీ లించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదా రులతో మాట్లాడారు. ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపు తిమ్మాపూర్ గ్రామంలో ఉపాధి హామీలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ రాజయ్య పని తీరు సరిగా లేదని, బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని పలువురు గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని విధుల నుంచి తొలగించి, మరొకరిని నియమించాలని అధికారులను ఆదేశించారు.