ఆదిబట్ల: భానుడి ప్రకోపానికి మంగళవారం ఆరుగురు బలయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో జిల్లా పరిధిలో వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు.
ఆదిబట్ల: భానుడి ప్రకోపానికి మంగళవారం ఆరుగురు బలయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో జిల్లా పరిధిలో వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. ఇబ్రహీంపట్నానికి చెందిన నిదానకవి కిృష్టయ్య(65) రెండు రోజులుగా నగర పంచాయ తీ కార్యాలయం చుట్టూ పింఛన్ కోసం తిరుగుతున్నాడు. వడదెబ్బకు గురై సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఐదుగురు కుమారులు ఉన్నారు.
పోచారంలో మరొకరు .....
మండల పరిధిలోని పోచారం గ్రామానికి చెందిన ఈర్లపల్లి అంజయ్య(38) రోజువారి కూలి. మంగళవారం పని నిమిత్తం ఇబ్రహీంపట్నానికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. ఈక్రమం లో ఆయన వడదెబ్బకు గురయ్యాడు. అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుం బీకులు ప్రభుత్వ ఆస్పత్రికితరలిస్తుం డగా మార్గమధ్యలోనే మృతిచెందాడు.
గండేడ్‌లో..
గండేడ్ : కూలికి వెళ్తున్న ఓమహిళ వడదెబ్బకు గురై మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని గాధిర్యాల్ గ్రామానికి చెందిన శీలం అంజమ్మ (32) భర్త మృతి చెందడంతో కొన్ని సంవత్సరాలుగా పుటింటిలోనే తల్లిదండ్రుల వద్ద నివసిస్తూ కూలి పనులకు వెళ్తుంది. రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురి కావడంతో మహమ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో సోమవారం చికిత్స చేయించుకుంది. రాత్రి 1.30 గంట సమయంలో అస్వస్థతకు గురైం ది. ఇది గమనించిన కుటుంబీకులు వెంటనే 108వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చె ందింది.
శంకర్‌పల్లిలో..
శంకర్‌పల్లి: వడదెబ్బకు వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని పొద్దుటూర్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన నక్క ఎల్లమ్మ(70)కు సోమవారం మధ్యాహ్నం వడదెబ్బ తగిలింది. గ్రామంలోని ఆస్పత్రిలో చికిత్సచేయించుకుంది. మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది.
బహీరాబాద్‌లో..
బహీరాబాద్: మండల పరిధిలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనికి చెందిన సున్నిబాయి కుమార్తె స్వాతి(7) మంగళవారం వడదెబ్బకు గురై మృతి చెందింది. వార్డు సభ్యుడు రామునాయక్, నాయకులు బసప్ప కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కొత్లాపూర్‌లో రైతు..
వడదెబ్బ తగిలి రైతు అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం ..మండల పరిధిలోని కొత్లాపూర్ గ్రామానికి చెందిన తుల్యానాయక్(45) వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
మంగళవారం ధాన్యం పట్టించేందుకు బషీరాబాద్‌కు వ చ్చాడు. తిరిగి గ్రామానికి చేరుకున్న అతను కుప్పకూలి పోయాడు. స్థానికులు గమనించగా అప్పటికే మృతి చెందాడు.