రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో డీసీఎం బోల్తాపడిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.
రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో డీసీఎం బోల్తాపడిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. బుధవారం పరిగి సమీపంలో పెళ్లి బృందంతో వెళుతున్న డీసీఎం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అదే రోజు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా 25 మంది వరకు గాయాలపాలై హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో చేరారు. వారిలో మర్పల్లి మండలం మొగిలిగుండ్లకు చెందిన ఎస్.అంజయ్య(38) శుక్రవారం మృతి చెందాడు. మరో 15 మంది వరకు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుండగా... సుమారు పది మంది వరకు డిశ్చార్జ్ అయ్యారు. మద్యం మత్తులో ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ పరారు కాగా, అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.