marriage van
-
ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య
రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో డీసీఎం బోల్తాపడిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. బుధవారం పరిగి సమీపంలో పెళ్లి బృందంతో వెళుతున్న డీసీఎం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అదే రోజు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా 25 మంది వరకు గాయాలపాలై హైదరాబాద్లోని పలు ఆస్పత్రుల్లో చేరారు. వారిలో మర్పల్లి మండలం మొగిలిగుండ్లకు చెందిన ఎస్.అంజయ్య(38) శుక్రవారం మృతి చెందాడు. మరో 15 మంది వరకు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుండగా... సుమారు పది మంది వరకు డిశ్చార్జ్ అయ్యారు. మద్యం మత్తులో ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ పరారు కాగా, అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
ఏడుకు పెరిగిన పరిగి మృతుల సంఖ్య
పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో రుకుంపల్లి గేట్ వద్ద బుధవారం ఉదయం పెళ్లి బృందం వ్యాను బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. సంఘటనా స్థలంలో నలుగురు మృతి చెందగా..15 మందికి పైగా తీవ్రంగా గాయపడడంతో వారిని హైదరాబాద్లోని షాదాన్, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. షాదాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతులను నవీన్, సంతోష్, శరణ్య, అనసూయ, లక్ష్మి, బుచ్చయ్య, మానయ్యలుగా గుర్తించారు. -
పెళ్లివ్యాను బోల్తా: నలుగురు మృతి
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఐ.పోలవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురుమృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. పెళ్లి వ్యాను బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. పందిరిమామిడి నుంచి పెళ్లి వ్యాను రంపచోడవరం వెళ్తుండగా గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.