పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో రుకుంపల్లి గేట్ వద్ద బుధవారం ఉదయం పెళ్లి బృందం వ్యాను బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. సంఘటనా స్థలంలో నలుగురు మృతి చెందగా..15 మందికి పైగా తీవ్రంగా గాయపడడంతో వారిని హైదరాబాద్‌లోని షాదాన్, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. షాదాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతులను నవీన్, సంతోష్, శరణ్య, అనసూయ, లక్ష్మి, బుచ్చయ్య, మానయ్యలుగా గుర్తించారు.