చలిమంట కాచుకోవడం కోసం పెట్టిన నిప్పులు గుడిసె(పూరిపాక)కు అంటుకోవడంతో అందులో నిద్రిస్తున్న ఓ రైతు సజీవ దహనమయ్యాడు.
రైతు సజీవదహనం
Published Mon, Jan 2 2017 1:46 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM
హుకుంపేట: చలిమంట కాచుకోవడం కోసం పెట్టిన నిప్పులు గుడిసె(పూరిపాక)కు అంటుకోవడంతో అందులో నిద్రిస్తున్న ఓ రైతు సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా హుకుంపేట మండలం ఉర్రాడ గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రామారావు(40) చలి తీవ్రతను తగ్గించడానికి చలిమంట వేసుకున్నాడు. నిప్పు రవ్వలు అతని నిద్రిస్తున్న పూరిపాకకు అంటుకోవడంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులోనే సజీవదహనమయ్యాడు.
Advertisement
Advertisement