సర్వే అధికారులను అడ్డుకున‍్న రైతులు
Published Sat, May 20 2017 11:51 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
సంతమాగులూరు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పరిటాలవారిపాళెం గ్రామ శివారులో అనంతపురం-అమరావతి జాతీయ రహదారి నిర్మాణానికి సర‍్వే చేసేందుకు వెళ్ళిన అధికారులను ఆ ప్రాంత రైతులు అడ్డుకున్నారు. శనివారం ఉదయం సర్వే అధికారులు కొలతలు వేసేందుకు వెళ్ళారు. విషయం తెలిసిన గ్రామస్థులు, రైతులు ఆ ప్రాంతానికి వెళ్ళి అడ్డుకున్నారు. తమకు ముందస్తు సమాచారం లేదని, నష‍్టపరిహారం ఎంత ఇస్తారో కూడా చెప‍్పలేదని వారు ఆగ్రహం వ‍్యక‍్తం చేశారు. ప్రభుత‍్వం పూర్తి వివరాలు ప్రకటించేవరకూ సర్వే చేయటానికి ఒప్పుకునేది లేదని రైతులు భీష‍్మించడంతో విధిలేక సర్వే అధికారులు వెనుతిరిగారు.
Advertisement
Advertisement