బ్యాంకు ముందు రైతుల ఆందోళన | farmers protest at bank in karimnagar district | Sakshi
Sakshi News home page

బ్యాంకు ముందు రైతుల ఆందోళన

Published Sat, Dec 17 2016 11:43 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

farmers protest at bank in karimnagar district

జమ్మికుంట: ధాన్యం అమ్ముకున్న డబ్బుల కోసం అదేపనిగా బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తోందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అమ్ముకున్న ధాన్యం తాలూకు సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేశామని, డబ్బు డ్రా చేసుకునేందుకు వస్తే స్థానిక కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు (కేడీసీసీబీ) అధికారులు డబ్బు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు.
 
ప్రతిరోజూ ఓచర్లు చేతబట్టుకుని తిరుగుతున్నామని, నిన్న రానివారికి ఇస్తాం ఈరోజు వచ్చిన వారికి డబ్బుల్లేవు అంటూ తిప్పి పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారుల తీరును నిరసిస్తూ 200 మంది రైతులు బ్యాంకు ఎదుట ఆందోళన నిర్వహించారు. కాగా, ప్రతిరోజూ చెప్పులతో లైన్ ఏర్పాటు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement