కొడుకును కడతేర్చిన తండ్రి | father killed by son | Sakshi
Sakshi News home page

కొడుకును కడతేర్చిన తండ్రి

Published Thu, Mar 31 2016 2:29 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

కొడుకును కడతేర్చిన తండ్రి - Sakshi

కొడుకును కడతేర్చిన తండ్రి

టీనగర్: అక్రమ సంతానంగా అనుమానించిన ఓ తండ్రి తన కొడకును హతమార్చి పాతిపెట్టాడు. బిడ్డ మృతదేహం కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. జేడర్‌పాళయం సమీపం జమీన్ ఇలంపల్లికి చెందిన పొన్నుసామి. ఇతని కుమారుడు తమిళ్ అలియాస్ తమిళ్‌సెల్వన్ (38). ఇతని భార్య రేవతి. వీరికి వివాహమై ఆరేళ్లు కావస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 21 డిసెంబర్, 2015లో రేవతి విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది. తిరుచెంగోడు ఆర్‌డీవో, జేడర్‌పాళయం పోలీసులు విచారణ జరిపారు.
 
 ఇందులో తమిళ్‌సెల్వన్ తన భార్య రేవతిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు తెలిపి అతన్ని అరెస్టు చేశారు. ఇలావుండగా పిల్లలు ఇరువురూ పరమత్తిలోగల రేవతి సోదరుడు భాస్కరన్ ఇంటిలో నివశిస్తూ వచ్చారు. ఇలావుండగా బెయిలుపై విడుదలైన తమిళ్ సెల్వన్ తన 11 నెలల బిడ్డ ధరణీష్‌ను గత 18వ తేదీన తన ఇంటికి తీసుకెళ్లాడు. రేవతి సోదరుడు భాస్కరన్ తమిళ్‌సెల్వన్ ఇంటికి వెళ్లి ధరణీష్‌ను చూడాలని కోరాడు. 
 
అందుకు తమిళ్‌సెల్వన్ ధరణీష్‌ను ఒక ఆలయంలో విడిచి వచ్చినట్లు పొంతన లేని సమాధానాలు తెలిపాడు. దీంతో అనుమానించిన భాస్కరన్ జేడర్‌పాళయం పోలీసు స్టేషన్‌లో తన చెల్లెలి కుమారుడిని ఫిర్యాదు చేశాడు. పోలీసులు తమిళ్‌సెల్వన్‌ను అరెస్టు చేసి విచారణ జరిపారు. విచారణలో జమీన్ ఇలంపిళ్లైకు సమీపంలోగల మైలాడుంపారై తోటలో బిడ్డను హతమార్చి పాతిపెట్టినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు గాలింపు జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement