సినీ ప్రముఖుడి కూతురి కిడ్నాప్ కలకలం
పెరంబూర్:
చెన్నైలో సినీ ప్రముఖుడి కూతురిని దుండగులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. స్థానిక అన్నాశాలైలోని వాణిజ్య సముదాయంలో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు టీ.నగర్‌లో చిత్రనిర్మాణ కార్యాలయం నిర్వహిస్తున్న ప్రసాద్(56) అన్నాశాలై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కూతురు అన్నాశాలైలోని ఒక షాపింగ్ మాల్ వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు.
అక్కడ ఓ వ్యక్తి తన కూతురి కిడ్నాప్‌నకు ప్రయత్నించి, చివరకు సెల్‌ఫోన్, డబ్బుతో అక్కడి నుంచి పారిపోయాడని పేర్కొన్నారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక అన్నానగర్‌లో దుండగుడి ఆచూకీ లభించడంతో అక్కడ గాలిస్తున్నట్లు తెలిపారు.