ఎడతెరపిలేని వర్షంతో విమానాల ఆలస్యం
Published Wed, Jun 29 2016 10:05 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైలో కురుస్తున్న కుండపోత వర్షంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెన్నై తదితర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో విమానాశ్రయం రన్‌వే నీళ్లతో నిండిపోయింది. మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత విదేశాలకు బయలుదేరాల్సిన విమానాలు చెన్నైలోనే నిలిచిపోయాయి. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన విమానాలు చెన్నైకి రాలేదు. రాత్రి 12 గంటల తర్వాత రన్‌వేపై నీళ్లు కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో విమానాలను అనుమతించారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా 30 విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి.
Advertisement
Advertisement