విధి నిర్వహణలో కానిస్టేబుల్ మృతి
Published Fri, Oct 21 2016 6:24 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
వైఎస్సార్ కడప జిల్లా: విధి నిర్వహణలో గుండెపోటుకు గురై ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. అటవీ శాఖకు చెందిన టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ హనుమంతు శుక్రవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.
బాలుపల్లి అటవీ రేంజ్‌లో కూంబింగ్ నిర్వహణకు వెళ్లి 9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసు అమరవీరుల దినోత్సవం రోజునే విధి నిర్వహణలో కానిస్టేబుల్ హనుమంతు గుండెపోటుతో మృతిచెందడంతో అధికారులు, తోటి కానిస్టేబుల్ సంతాపం తెలిపారు. కానిస్టేబుల్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Advertisement
Advertisement