
వృద్ధురాలిని మోసుకొస్తున్న కానిస్టేబుల్ కుళ్లాయప్ప
కడప వైఎస్సార్ సర్కిల్: కాలిబాటన తిరుమలకు పాదయాత్రగా వెళుతున్న ఓ వృద్ధురాలు మార్గమధ్యలో అస్వస్థతకు గురై కింద పడిపోయింది. వెంటనే ఓ పోలీస్ వచ్చి వృద్ధురాలిని భూజాలపై నాలుగు కిలోమీటర్లు మోసుకొని వెళ్లి ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడాడు. రాజంపేట మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి వేలాది మంది భక్తులతో తిరుమలకు ఇటీవల పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర సోమవారం నాడు అన్నమయ్య కాలిబాటలో యాత్ర కొనసాగింది. మార్గంమధ్యలోకి ఓ వృద్ధురాలు పాదయాత్రను అనుసరించింది. కాసేపటికే ఆమె తీవ్ర అస్వస్థతకు గురై నడవలేని స్థితిలో కుప్పకూలింది. పాదయాత్ర బందోబస్తులో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ కుళ్లాయప్ప వృద్ధురాలిని గమనించాడు. నడక తప్ప మరో మార్గంలేని అటవీ ప్రాంతం నుంచి భక్తురాలిని నాలుగు కిలోమీటర్లు భుజాలపై మోసుకువెళ్లి సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నాడు. కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ కేకేఎన్ ఆన్బురాజన్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment