వైద్యుల ప్రాణాలు తీసిన సెల్ఫీ మోజు | four doctors drowned to death while taking selfies | Sakshi
Sakshi News home page

వైద్యుల ప్రాణాలు తీసిన సెల్ఫీ మోజు

Published Tue, May 2 2017 12:02 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

వైద్యుల ప్రాణాలు తీసిన సెల్ఫీ మోజు

వైద్యుల ప్రాణాలు తీసిన సెల్ఫీ మోజు

వాళ్లంతా వైద్యులు. నిరంతరం వైద్యవృత్తిలో మునిగి తేలుతుంటారు. ఆ ఒత్తిడి నుంచి బయట పడేందుకు షోలాపూర్‌లో ఒక నదిలో బోటింగ్ చేద్దామని వెళ్లారు. ఇందపూర్ సమీపంలో భీమా నదిలోని ఉజేన్ డ్యాం వద్ద బోటింగ్‌కు వెళ్లిన తర్వాత నది మధ్యలో సీన్ చాలా బాగుందని, అక్కడ సెల్ఫీలు తీసుకుంటే బాగుంటుందని అనుకున్నారు. అలా సెల్ఫీలు తీసుకునే క్రమంలో పడవ అదుపుతప్పి.. తిరగబడింది. దాంతో నలుగురు వైద్యులు నీళ్లలో మునిగి చనిపోయారు. వారిలో ఒకరి మృతదేహం సాయంత్రానికే బయటపడగా మిగిలిన మూడింటినీ మర్నాటి ఉదయానికి తీయగలిగారు. వారాంతంలో సరదాగా గడుపుదామని మొత్తం 10 మంది వైద్యుల బృందం బయల్దేరింది. సాయంత్రం సమయంలో వాళ్లు స్థానిక మత్స్యకారుల వద్ద అడిగి ఓ బోటు అద్దెకు తీసుకున్నారు. అయితే వారికి సరిగా ఈత రాకపోవడంతో పాటు.. బోటింగ్ చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏమీ తెలియవు. పడవ నడిపేందుకు కూడా ఎవరినీ తీసుకెళ్లకుండా తమంతట తామే వెళ్లిపోయారు. వద్దని మత్స్యకారులు ఎంత వారించినా వాళ్లు వినలేదు. తాము వైద్యులమని, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తమకు తెలుసని చెప్పారు.

నది సగంలోకి వెళ్లిన తర్వాత కొంతమంది వైద్యులు సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టారు. దాంతో బోటు ఒకవైపు ఒరిగిపోయింది. కొంతమంది బోటు నుంచి నీళ్లలోకి దూకేశారు. వారిలో ఒకరు మళ్లీ బోటు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆయన కాలు చేపల వలలో ఇరుక్కుపోయి బోటు మునిగిపోయింది. వారిలో ఆరుగురికి ఈత రావడంతో ఎలాగోలా జాగ్రత్తగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన నలుగురూ ప్రాణాలు కోల్పోయారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement