selfie craze
-
సెల్ఫీ జోష్.. డేంజర్ బాస్
సాక్షి, హైదరాబాద్: సెల్ఫీ.. బాగా ప్రాచుర్యం పొందిన, ఎవరికి వారు స్వయంగా తీసుకునే సెల్ ఫోన్ ఆధారిత ఫొటో. దీనికోసం ప్రత్యేక సెల్ ఫోన్లు, స్టిక్కులతో పాటు కోర్సులు కూడా అందు బాటులోకి వచ్చాయంటేనే వాటికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకో వచ్చు. ముఖ్యంగా కొంతమంది యువ తలో ఈ క్రేజ్ విపరీత స్థాయిలో ఉంటోంది. అయితే ఈ క్రేజ్ కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాలనే హరి స్తోంది. ఈ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నాల్లో అనేక మంది ప్రమాదాలకు గురై చనిపోతున్నారు.ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు అధిక సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. దేశంలో గత ఏడాది సెల్ఫీ సంబంధిత మరణాలు 190 నమోద య్యాయి. తీవ్రంగా గాయపడిన ఉదంతాలు 55 చోటు చేసుకున్నట్లు వికీపీడియా గణాంకాలు చెప్తు న్నాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రమాదాలు భారత్‌లోనే ఎక్కువని స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ ఇలాంటి మరణాలు ఎక్కువ గానే జరుగుతున్నాయి. నగరంలో 2016లో తొలి సెల్ఫీ డెత్ నమోదైంది. జూ పార్క్‌లో సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో కాలుజారి పడటంతో జియాగూడ వాసి మంజీత్ చౌదరి కన్నుమూశాడు.2024 జనవరి 7ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాలుడు (16) అల్వాల్‌లో ఉంటున్న తన బాబాయి ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు. ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఈ బాలుడు బొల్లారం బ్యారెక్ సమీపంలోని రైల్వే లెవల్ క్రాసింగ్ వద్దకు చేరుకున్నాడు. వెనుక నుంచి రైలు వస్తుండగా సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే రైలు దూసుకు రావడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.2024 జనవరి 29హైదరాబాద్ బహదూర్‌పురకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ (23) అబిడ్స్ లోని కళ్లజోళ్ల దుకాణంలో పనిచేస్తు న్నాడు. తనస్నేహితులతో కలిసి ఉప్పుగూడ–యాకత్‌పుర రైల్వే స్టేష న్ల మధ్య రైల్వే ట్రాక్‌ల వద్దకు వెళ్లా డు. అక్కడ సెల్ఫీ తీసుకునే ప్రయ త్నాల్లో రైలు పట్టాల మీదకు చేరుకు న్నాడు. అదే సమయంలో దూసుకు వచ్చిన ఎంఎంటీఎస్ ఢీ కొట్టడంతో తీవ్రగాయాలతో చనిపోయాడు.2024 ఏప్రిల్ 5ఏపీకి చెందిన ఎస్.అనిల్ కుమార్ (27) భార్యతో కలిసి హైదరా బాద్‌లోని మాదాపూర్‌లో ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అర్ధ రాత్రి వేళ తన స్నేహితుడు అజ య్‌తో కలిసి కేబుల్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. తమ ద్విచక్ర వాహనాన్ని వంతెనపై నిలిపిన ఈ ద్వయం సెల్ఫీలు తీసుకుంటోంది. ఇంతలో ఇనార్బిట్ మాల్ వైపు నుంచి వచ్చిన కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన అనిల్ చికిత్స పొందుతూ అసువులు బాశాడు.2024 జూన్ 15హైదరాబాద్‌కు చెందిన ఉదయ్‌కుమార్ (17), శివదీక్షిత్ (17) మరో బాలుడు (17) ఇంటర్ పూర్తి చేశారు. బాలుడి పుట్టినరోజు కావడంతో శుక్రవారం అర్ధరాత్రి కేకుకోసిన అనంతరం మాదాపూర్ కేబుల్ బ్రిడ్జికి బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున 2.18 ప్రాంతంలో ముగ్గురూ స్కూటీపైనే ఉండి రీల్స్ చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆగి ఉన్న డీసీఎం వ్యాన్‌ను వెనుక నుంచి ఢీకొట్టారు. ఉదయ్, దీక్షిత్ అక్కడిక్కడే మరణించగా.. బాలుడు గాయపడ్డాడు. అత్యుత్సాహంతోనే చేటు..సెల్ఫోన్లు వచ్చినప్పటి నుంచే ఈ సెల్ఫీల జాఢ్యం మొదలవలేదు. ఎప్పుడైతే వాటిల్లో ఫ్రంట్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయో అప్ప ట్నుంచీ సెల్ఫీ క్రేజ్ ప్రారంభమై, క్రమంగా మంచి రెజుల్యూషన్ (ఫొటో స్పష్టంగా కన్పిస్తుంది)తో కూడిన ఫొటోలు వచ్చే ఫ్రంట్ కెమెరాలు కూడా వస్తుండటంతో ఈ సెల్ఫీల పిచ్చి మరింత ముదిరి పోయింది. సెల్ఫీ మోజులో ఉంటున్న వారిలో ఎక్కువగా యువతే ఉంటు న్నారు. ఏదో రకంగా విభిన్నమైన సెల్ఫీని తీసుకో వాలనే తాపత్రయంలో ప్రమాదకర పరిస్థితుల్ని పట్టించుకోకుండా సెల్ఫీలు దిగేందుకు ప్రయత్ని స్తున్నారు. వెనుక నుంచి రైలు వస్తుండగానో, వాహనాలు డ్రైవ్ చేస్తూనో, జలపాతాల వద్దో, బీచ్ ల్లోనో, ఎత్తైన ప్రదేశాల్లోనో సెల్ఫీలకు ప్రయత్నిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.సోషల్ మీడియా ప్రాచుర్యం పొందిన తర్వాత..ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలు ప్రాచుర్యం పొందిన తర్వాత సెల్ఫీ ఫీవర్ మరింత ఎక్కువైంది. ఆయా సోషల్ మీడియాల్లో ఎవరి ప్రొఫైల్ పిక్ చూసినా, అప్లోడ్ చేసిన ఫొటోలు పరిశీలించినా సగానికి సగం సెల్ఫీలే కనిపిస్తు న్నాయి. ఒకరిని చూసి మరొకరు, ఒకరి ప్రొఫైల్స్ చూసి ఇంకొకరు... ఇలా అంతా సెల్ఫీల బాటపడుతున్నారు. ఇటీవలి కాలంలో వీటితో పాటు రీల్స్ (షార్ట్ వీడియోలు) కూడా సోషల్ మీడియాల్లో ఎక్కువగా కన్పిస్తుండటం గమనార్హం. మరోపక్క ఈ సెల్ఫీలను మార్ఫింగ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడే సైబర్ నేరాలు పెరుగుతుండటం గమనార్హం.‘నో పార్కింగ్’ తరహాలో..ప్రజల్లో ముఖ్యంగా యువతలో మితిమీరి పోతున్న ఈ సెల్ఫీ పిచ్చి ప్రభుత్వ విభాగాలకూ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ నేప థ్యంలోనే ‘నో పార్కింగ్’ ప్రాంతాల తరహాలో మహారాష్ట్రలో ‘నో సెల్ఫీ’ ప్రాంతాలు అమల్లోకి వచ్చాయి. కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన కుంభ్‌మేళాలో సెల్ఫీ ప్రియుల కారణంగా అనేక ప్రాంతాలు ఇరుకైన ప్రదేశాలుగా మారిపోయి ఇతరులకు ఇబ్బందులు కలిగించాయి. ఆయా ప్రాంతాలను దాటి వెళ్లడానికి భక్తులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో కుంభమేళాను అధికారులు ‘నో సెల్ఫీ జోన్’గా ప్రకటించాల్సి వచ్చింది. సెల్ఫీలను నిరోధించడం కోసం ముంబై పోలీసులు నగరంలోని 16 ప్రాంతాలను ‘నో సెల్ఫీ జోన్స్’గా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ సైతం ఏర్పాటు చేశారు. ఇలాంటి చర్యలు హైదరాబాద్‌లోనూ తీసుకోవాలనే అభిప్రాయంగా గట్టిగా వ్యక్తమవుతోంది.సెల్ఫీకి ముందు సప్త ప్రశ్నలుసెల్ఫీలు, రీల్స్ వల్ల ప్రమాదాలకు గురికాకుండా ఉండటం, అవి ఇతరులకు ఇబ్బందికరంగా మారకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికి వారు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 1. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రాంతాల్లో ఫొటోగ్రఫీకి అనుమతి ఉందా?(మ్యూజియాలు, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, విద్యా సంబంధ వ్యవహారాల్లో)2. ఈ ప్రదేశంలో సెల్ఫీ కారణంగా తనకు కానీ తన చుట్టు పక్కల వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉందా? (జూ పార్కులు, థీమ్ పార్కులు, జనసమ్మర్థ ప్రాంతాలు, మాల్స్, సబ్వేస్, విమానా శ్రయాలు, రైల్వే ట్రాక్‌లు, వాహనాలు నడుపుతూ)3. సెల్ఫీ తీసుకుంటూ నేను ఎదుటివారు చూస్తున్న వాటికి అడ్డం వస్తున్నానా? ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నానా? (థీమ్ పార్కులు, సినిమా హాళ్లు, సందర్శనీయ ప్రాంతాలు, కొన్ని కార్యక్రమాలు)4. సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో మరో వర్గా నికి చెందినవారి మనోభావాలు దెబ్బతీస్తు న్నామా? (ప్రార్థనా స్థలాలు)5. సెల్ఫీ తీసుకుంటున్న ప్రాంతంలో కంటికి కనిపించని ముప్పు పొంచి ఉందా?(జూ పార్క్‌లు, జాతీయ పార్కులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎత్తైన భవనాలు/ప్రాంతాలు, ఓడలు, సబ్ వేస్, కదులుతున్న వాహనాలు, రహదారులు)6. సెల్ఫీ తీసుకోవడం సమంజసమేనా?(ప్రమాదం జరిగిన ప్రాంతాలు, అంతిమ యాత్రలు)7. నేను తీసుకుంటున్న సెల్ఫీ ఇతరులకు అభ్యంతకరం అవుతుందా?(పార్టీలు, రెస్ట్‌రూమ్స్ సమీపంలో, బీచ్‌ల్లో) -
ప్రాణం తీసిన సరదా
సాక్షి, విజయనగరం: సెల్ఫీల మోజులో పడి ప్రతి రోజు ఎక్కడోఅక్కడ ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పుతున్నారనే వార్తలు వింటూనే ఉన్నాం. అయినా యువతీ యువకులు తమ విపరీత పోకడలను వదులు కోవడం లేదు. తీగ వంతెనపై నిల్చొని సెల్ఫీ దిగడానికి యత్నించిన ఇద్దరు యువతులు ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందారు. ఈ సంఘటన ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని రాయఘడ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. విశాఖపట్నంకు చెందిన 9 మంది బృందం విహారయాత్ర నిమిత్తం రాయఘడ జిల్లాలోని మజ్జిగౌరమ్మ ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలో అమ్మవారి దర్శన అనంతరం దేవాలయం సమీపంలోని నాగావళి నదిపై ఉన్న తీగ వంతెన వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడ నిల్చొని సెల్ఫీలకు ఫోజులిస్తున్న జ్యోతి(27), ఎస్ దేవి(21) ప్రమాదవశాత్తు నదిలో పడిపోయారు. వారిని రక్షించడానికి యత్నించినా లాభంలేకపోయింది. గజ ఈతగాళ్ల సాయంతో ఇద్దరు యువతుల మృతదేహాలను బయటకు తీశారు. ఈ తొమ్మిది మంది విశాఖ నగరంలోని వైభవ్ జ్యూయలర్స్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. -
వైద్యుల ప్రాణాలు తీసిన సెల్ఫీ మోజు
వాళ్లంతా వైద్యులు. నిరంతరం వైద్యవృత్తిలో మునిగి తేలుతుంటారు. ఆ ఒత్తిడి నుంచి బయట పడేందుకు షోలాపూర్‌లో ఒక నదిలో బోటింగ్ చేద్దామని వెళ్లారు. ఇందపూర్ సమీపంలో భీమా నదిలోని ఉజేన్ డ్యాం వద్ద బోటింగ్‌కు వెళ్లిన తర్వాత నది మధ్యలో సీన్ చాలా బాగుందని, అక్కడ సెల్ఫీలు తీసుకుంటే బాగుంటుందని అనుకున్నారు. అలా సెల్ఫీలు తీసుకునే క్రమంలో పడవ అదుపుతప్పి.. తిరగబడింది. దాంతో నలుగురు వైద్యులు నీళ్లలో మునిగి చనిపోయారు. వారిలో ఒకరి మృతదేహం సాయంత్రానికే బయటపడగా మిగిలిన మూడింటినీ మర్నాటి ఉదయానికి తీయగలిగారు. వారాంతంలో సరదాగా గడుపుదామని మొత్తం 10 మంది వైద్యుల బృందం బయల్దేరింది. సాయంత్రం సమయంలో వాళ్లు స్థానిక మత్స్యకారుల వద్ద అడిగి ఓ బోటు అద్దెకు తీసుకున్నారు. అయితే వారికి సరిగా ఈత రాకపోవడంతో పాటు.. బోటింగ్ చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏమీ తెలియవు. పడవ నడిపేందుకు కూడా ఎవరినీ తీసుకెళ్లకుండా తమంతట తామే వెళ్లిపోయారు. వద్దని మత్స్యకారులు ఎంత వారించినా వాళ్లు వినలేదు. తాము వైద్యులమని, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తమకు తెలుసని చెప్పారు. నది సగంలోకి వెళ్లిన తర్వాత కొంతమంది వైద్యులు సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టారు. దాంతో బోటు ఒకవైపు ఒరిగిపోయింది. కొంతమంది బోటు నుంచి నీళ్లలోకి దూకేశారు. వారిలో ఒకరు మళ్లీ బోటు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆయన కాలు చేపల వలలో ఇరుక్కుపోయి బోటు మునిగిపోయింది. వారిలో ఆరుగురికి ఈత రావడంతో ఎలాగోలా జాగ్రత్తగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. -
ప్రాణాలు హరించిన సెల్ఫీ!
బనశంకరి (బెంగళూరు): పార్కులో సరదాగా గడపడానికి వచ్చిన బాలుడు అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. శ్రీరామపురకు చెందిన కుమార్, రేవతి దంపతులు ఆరేళ్ల కుమారుడు విక్రమ్‌తో కలసి సోమవారం మధ్యాహ్నం 2.45 గంటలకు లాల్బాగ్ వీక్షణకు వెళ్లారు. ఐదడుగుల పొడవైన నిలువెత్తు రాయి మీద బాబును కూర్చోబెట్టి సెల్ఫోన్లో సెల్ఫీ తీసుకుంటుండగా, రాయి కిందపడింది. దానిమీదున్న బాలుడు కూడా కిందపడ్డాడు. రాయి బలంగా తాకడంతో అక్కడికక్కడే అక్కడే దుర్మరణం చెందాడు. కుమారుడు కళ్లముందే మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. లాల్బాగ్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని వారు ఆరోపించారు. సిద్ధాపుర పోలీసులు కేసు విచారణ చేపట్టారు. రాతి స్తంభంపై కూర్చుని సెల్ఫీ తీయడంతోనే ప్రమాదం చోటుకుందని ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. బాలుడు విక్రమ్ రాతి పిల్లర్‌పై కూర్చుని సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో పిల్లర్ పడిపోయిందని చెప్పారు. కాగా, 2015 ఆగస్టులో వైష్ణవి అనే విద్యార్థిని ఇదే పార్కులో తేనేటీగలు దాడిచేయడంతో చనిపోయింది. -
ప్రాణాలు తీసిన సెల్ఫీ
మైపాడు బీచ్‌లో ముగినిపోయి ముగ్గురు యువకులు మృతి పోలీసులకు తెలిస్తే ఇబ్బందువుతుందని మృతదేహాలను నెల్లూరుకు తీసుకువచ్చిన స్నేహితులు నెల్లూరు రంగనాయకులపేట, కనుపర్తిపాడులో విషాదచాయలు నెల్లూరు(క్రైమ్) : సముద్రంలో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి మునిగిపోయి ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. ఇందుకూరుపేట పోలీసులు, సేకరించిన సమాచారం మేరకు.. నెల్లూరు రంగనాయకులపేట రైలువీధికి చెందిన ఎస్కే అబ్దుల్ ముసావీర్(23), రబ్బానీబాష, ఫాజిల్, ఇసుకడొంకకు చెందిన నదీమ్(23), కనుపర్తిపాడుకు చెందిన బి.హరీష్(24), అంబాపురానికి చెందిన సుబ్రమణ్యం, బట్వాడిపాలెంకు చెందిన గజేంద్రఉదయ్లు స్నేహితులు. ముసావీర్, రబ్బానీబాషాలు వెంకటాచలంలోని క్యూబా కళాశాలలో బీటెక్ పూర్తిచేసి ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నారు. నదీమ్, సుబ్రమణ్యం, గజేంద్ర ఉదయ్‌లు బురాన్‌పూర్ సమీపంలోని హోండాషోరూమ్లో పనిచేస్తుండగా ఫాజిల్ ఎంజీబ్రదర్స్లో పనిచేస్తున్నాడు. ఆదివారం వీరంతా కలిసి మైపాడు బీచ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకుగానూ నదీమ్ తన తండ్రి సర్వీసుకు తీసుకొచ్చిన మారుతీ వ్యాన్‌ను సిద్ధం చేశారు. ఆదివారం తెల్లవారుజామున ముసవీర్, రబ్బాని, ఫాజిల్, నదీమ్‌లు రంగనాయకులపేటలోని పెద్దమసీదులో నమాజు చేసుకుని బయటకు వచ్చేలోపు హరీష్,సుబ్రమణ్యం, గజేంద్ర ఉదయ్‌లు వచ్చారు. అందరూ కలిసి మైపాడు బీచ్‌కు వెళ్లారు. అందరూ మునిగే చోటున కాకుండా.. ఏడుమంది పర్యాటకులు మునిగే ప్రాంతంలో కాకుండా అతి సమీపంలో ఉన్న చేపలు ఆరబెటే ప్లాట్‌ఫాం ఎదురుగా మునిగేందుకు సముద్రపు నీటిలోదిగారు. కొంతసేపు సరదాగా ఆడుకున్నారు. ఇంతలో సెల్ఫీ తీసుకునేందుకు స్నేహితులు నీళ్లలో కొద్దిదూరం వెళ్లారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు అలల తాకిడికి నీటిలో మునిగిపోయారు. గజేంద్ర ఉదయ్ ఈతకొట్టుకుంటూ కొద్దిదూరం వచ్చి పెద్దగా కేకలు వేశాడు. ఈవిషయాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు హుటాహుటిన సముద్రంలో దూకి మిగిలిన ఆరుగురుని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే పరిస్థితి విషమంగా మారింది. ముసావీర్, నదీమ్, హరీష్‌లు మృత్యువాత పడగా మిగిలిన వారిని సురక్షితంగా ఒడ్డున చేర్చారు. వారందరూ సముద్రం నీటిని తాగి ఉండటంతో వాటిని కక్కించారు. ఈ విషయం పోలీసులకు తెలిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన మిగిలిన స్నేహితులు మృతదేహాలను కారులో వేసుకుని నెల్లూరుకు చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఇందుకురుపేట ఎస్ఐ ఎస్కే షరీఫ్ హుటాహుటిన నెల్లూరుకు చేరుకున్నారు. బాధిత తల్లిదండ్రులు మాత్రం తమకు ఎలాంటి కేసు వద్దని చెప్పడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. విషాదచాయాలు ముసావీర్ మృతితో రంగనాయకులపేట రైలువీధిలో విషాదచాయలు అలముకున్నాయి. రైలువీధికి చెందిన ముస్తాక్ బైక్ మెకానిక్, అతనికి ముగ్గురు పిల్లలు. రెండోకుమారుడు ముసాఫీర్. ముస్తాక్ తన పిల్లలను ఉన్నత చదువులు చదివించడంతో పాటు క్రమశిక్షణగా పెంచాడు. ముసాఫీర్ క్యూబా కాలేజీలో బీటెక్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్న కుమారుడు విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఎవరి కోసం బ్రతకాలి? కన్నకొడుకు మృత్యువాత పడడంతో ఇక తామెవరికోసం బ్రతకాలని నదీమ్ తల్లిదండ్రులు విలపించారు. ఇసుకడొంకకు చెందిన నజీర్‌కు నదీమ్, ఓ కుమార్తె ఉంది. ఆయన కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. నదీమ్ సైతం తండ్రి మాటను జవదాటేవాడే కాదు. ప్రస్తుతం వెంకటాచలం మండలం బురాన్‌పూర్ సమీపంలోని హోండాషోరూమ్లో పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అతనికి పెళ్లిచేసే ప్రయత్నాల్లో కుటుంబసభ్యులున్నారు. ఈనేపథ్యంలో సముద్రం మృత్యువురూపంలో నదీమ్‌ను బలితీసుకుంది. తామెవరికీ అన్యాయం చేయలేదని, అయినా దేవుడు తమకు ఎందుకు ఇంత శిక్ష వేశాడని గుండెలవిసేలా రోదించారు. పెళ్లైన ఏడాదిన్నరకే.. బైనమూడి హరీష్‌కు ఏడాదిన్నర క్రితం పూజ రోహితతో వివాహమైంది. వివాహమైన నాటినుంచి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. హరీష్ బురాన్పూర్లోని హోండా షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం సముద్రస్నానికి వెళుతున్నాని కుటుంబసభ్యులకు చెప్పి ఇంట్లోనుంచి బయటకు వచ్చాడు. బీచ్‌లో మునిగి మృతిచెందాడు. అతని భార్య గుండెలవిసేలా రోదించడం చూపరులను కంటతడిపెట్టించింది. -
ప్రాణం తీసిన తుపాకీతో సెల్ఫీ
శాన్ఫ్రాన్సిస్కో: సెల్ఫీ మోజులో పడి ఓ వ్యక్తి తుపాకీతో ప్రమాదవశాత్తూ తనను తాను కాల్చుకొని ప్రాణాలు కోల్పోయాడు. వాషింగ్టన్కు చెందిన ఓ 43 ఏళ్ల వ్యక్తి తన స్నేహితురాలితో కలిసి సెల్ఫీలు తీసుకుంటున్నాడు. ఈ సందర్భంగా తుపాకీతో ఫోజు ఇస్తూ ఫోటో తీసుకోబోయి తుపాకీ ట్రిగ్గర్ నొక్కేశాడు. తుపాకీలో బులెట్లు లేవని భావించే ఆయన ఈ సాహసానికి ఒడిగట్టాడని అది అతని ప్రాణాలను హరించిందని అక్కడి పోలీసులు చెప్తున్నారు. -
సెల్ఫీ@1151
సెల్ఫీల క్రేజ్ ఎంత ఉందో మనకు తెలిసిందే.. చివరికి బాత్రూంలలో సెల్ఫీలు తీసి నెట్లో పోస్ట్ చేస్తున్నవాళ్లు ఉన్నారు. అయితే.. ఈ సెల్ఫీకి మాత్రం ఓ విశేషముంది. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ సెల్ఫీ.. ఈ మధ్య బంగ్లాదేశ్‌లోని ఢాకాలో తీశారు. ఇందులో మొత్తం 1,151 మంది పాలుపంచుకున్నారు. సెల్ఫీల కోసమే ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్ మార్కెట్లోకి విడుదల చేసిన లూమియా 730 ఫోన్‌తో దీన్ని తీశారు. ఈ రికార్డును గిన్నిస్ బుక్ వారు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.