
సాక్షి, విజయనగరం: సెల్ఫీల మోజులో పడి ప్రతి రోజు ఎక్కడోఅక్కడ ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పుతున్నారనే వార్తలు వింటూనే ఉన్నాం. అయినా యువతీ యువకులు తమ విపరీత పోకడలను వదులు కోవడం లేదు. తీగ వంతెనపై నిల్చొని సెల్ఫీ దిగడానికి యత్నించిన ఇద్దరు యువతులు ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందారు. ఈ సంఘటన ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని రాయఘడ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.
విశాఖపట్నంకు చెందిన 9 మంది బృందం విహారయాత్ర నిమిత్తం రాయఘడ జిల్లాలోని మజ్జిగౌరమ్మ ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలో అమ్మవారి దర్శన అనంతరం దేవాలయం సమీపంలోని నాగావళి నదిపై ఉన్న తీగ వంతెన వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడ నిల్చొని సెల్ఫీలకు ఫోజులిస్తున్న జ్యోతి(27), ఎస్ దేవి(21) ప్రమాదవశాత్తు నదిలో పడిపోయారు. వారిని రక్షించడానికి యత్నించినా లాభంలేకపోయింది. గజ ఈతగాళ్ల సాయంతో ఇద్దరు యువతుల మృతదేహాలను బయటకు తీశారు. ఈ తొమ్మిది మంది విశాఖ నగరంలోని వైభవ్ జ్యూయలర్స్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment