ముంబై: మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 231 పరీక్ష కేంద్రాలకు పవర్ జనరేటర్లను, ఇన్వర్టర్లను అందించిందని రాష్ట్ర మాధ్యమిక, ఉన్నత విద్యా మండలి హైకోర్టుకు తెలిపింది. బోర్డుకు చెందిన అధికారులు ఇటీవల అన్ని పరీక్ష కేంద్రాలను సందర్శించి, జనరేటర్లు, ఇన్వర్టర్లును తనిఖీ చేశారని పేర్కొంది. విద్యుత్ కోతల వల్ల విద్యార్థులు చీకట్లో పరీక్షలు రాయాల్సి వస్తోందని విష్ణు గవలి అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పరీక్షలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం జస్టిస్ అభయ్ నేత ృత్వంలోని ధర్మాసనానికి బోర్డు ఈ విషయం తెలిపింది. విద్యుత్ కోతల వల్ల విద్యార్థులు చీకటిలో పరీక్షలు రాయాల్సివస్తోందని, అన్ని పరీక్ష కేంద్రాల్లో యుద్ధ ప్రాతిపదికన జనరేటర్లు ఏర్పాటు చేయాలని కోర్టు జులైలో ఆదేశించడంతో ప్రభుత్వంలో చలనం మొదలైంది.
అయితే 18 పరీక్షా కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేయలేద ని విద్యామండలి కోర్టుకు విన్నవించింది. దీంతో పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. కేంద్రాల్లో విద్యుత్ కోతల సమస్యను 2008లో కోర్టుకు విన్నవించానని, కోర్టు దాన్ని పిల్‌గా స్వీకరించిందని విష్ణు గవలి తెలిపారు. 2009 ఫిబ్రవరిలో హైకోర్టు ప్రభుత్వానికి అన్ని కేంద్రాల్లో 40వేలకు పైగా జనరేటర్లు ఏర్పాటుచేయాలని నిర్దేశించిందని తెలిపారు. అలాగే పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు విధించొద్దంటూ రాష్ట్ర విద్యుత్ బోర్డుకు ఆదేశించింది.
అన్ని పరీక్ష కేంద్రాల్లో జనరేటర్లు కోర్టుకు తెలిపిన విద్యామండలి
Published Sun, Mar 1 2015 1:36 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement