ప్రజల్లోకి చొచ్చుకెళ్లి, టీఎంసీకి మద్దతు కూడగ ట్టుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు జీకే వాసన్ సిద్ధం అయ్యారు. సోమవారం నుంచి రాష్ట్రం లో పర్యటించనున్నారు. వంద రోజుల పాటు పర్యటనకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ప్రధానంగా 120 అసెంబ్లీ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకుని ఈ పర్యటన సాగబోతున్నది.
సాక్షి, చెన్నై :కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జీకే వాసన్ తన తండ్రి మూపనార్ స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ)ని పునరుద్దరించిన విషయం తెలిసిందే. టీఎంసీ పునరుద్ధరణతో కాంగ్రెస్‌లో భారీగా చీలిక ఏర్పడింది. టీఎంసీ బలోపేతం లక్ష్యంగా వాసన్ ముందుకు సాగుతూ వస్తున్నారు. ఇటీవలే పార్టీ జిల్లాల, రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ఆయా జిల్లా కమిటీల నేతృత్వంలో కార్యక్రమాల్ని విస్తృతం చేస్తూ ప్రజాకర్షణ దిశగా వాసన్ పయనం సాగుతూ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇక, ప్రజల్లోకి దూసుకెళ్లి బలం చాటడం లక్ష్యంగా వాసన్ కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి వంద రోజుల పాటుగా ఆయన పర్యటన సాగబోతున్నది.
ప్రజల్లోకి : తనకు మద్దతు దారులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలు, తన తండ్రి గతంలో ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలు, ఇలా బలం ఉన్న స్థానాల గుండా తన పర్యటన సాగించేందుకు వాసన్ కార్యచరణ సిద్ధం చేశారు. 32 జిల్లాల్లోని 120 అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఎంపిక చేసుకుని ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాలను కలుపుతూ వంద రోజుల పాటుగా ఈ పర్యటన సాగబోతున్నది. ప్రజా సమస్యలు, తన తండ్రి మూపనార్ ఆశయ సాధన లక్ష్యంగా పయనం సాగించేందుకు సిద్ధ పడ్డ వాసన్, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలతో సమావేశాలు, సమాలోచనలు జరపనున్నారు. కార్యకర్తలతో సంప్రదింపులు నిర్వహిస్తూ ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా డిసెంబరు వరకు తన పర్యటన తేదీని సిద్ధం చేసుకుని ఉండటం విశేషం.
ప్రజల్లోకి వాసన్
Published Mon, Aug 3 2015 2:48 AM | Last Updated on Tue, Aug 14 2018 7:49 PM
Advertisement
Advertisement