సాక్షి, ముంబై: ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన తర్వాత తొలిసారిగా నగరానికి చేరుకున్న గుజరాత్ ముఖ్యమంంత్రి నరేంద్ర మోడీకి ఘనస్వాగతం లభించింది. పార్టీ నగరశాఖ అధ్యక్షుడు అశీశ్ శెలార్, అగ్ర నాయకుడు గోపీనాథ్ ముండే, వినోద్ తావ్డేలతోపాటు ఆ పార్టీ పదాధికారులు, కార్యకర్తలు భారీసంఖ్యలో చేరుకోవడంతో విమానాశ్రయ పరిసరాలు కిటకిటలాడాయి. కాగా నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా వెండితో తులాభారం వేశారు. ఈ వెండిని సర్దార్ వల్లభ్‌భాయ్‌భాయ్ ట్రస్టు కోసం వినియోగించ నున్నట్టు మోడీ ప్రకటించారు.
ప్రపంచంలో అతి పెద్దదైన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం కోసం వినియోగిస్తామని ఆయన చెప్పారు.కాగా బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో డైమండ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా హాజరయ్యారు. నరేంద్ర మోడీ సింహాసనంపై కూర్చోగా, ఉద్ధవ్ మాత్రం సోఫాకే పరిమితమయ్యారు.
మోడీకి ఘనస్వాగతం
Published Mon, Sep 30 2013 11:26 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement