మోడీకి శుభాకాంక్షలు తెలిపిన మన్మోహన్ | Prime Minister Manmohan Singh congratulates Narendra Modi | Sakshi

మోడీకి శుభాకాంక్షలు తెలిపిన మన్మోహన్

Published Fri, May 16 2014 2:11 PM | Last Updated on Fri, Mar 29 2019 9:01 PM

ప్రధాని మన్మోమోహన్ సింగ్ గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మన్మమోహన్ సింగ్ గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం మోడీకి ప్రధాని మన్మోహన్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం ట్విట్టర్లో వెల్లడించింది.

 

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తమ పార్టీ ప్రధాని అభ్యర్థి అని బీజేపీ గతంలో ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల్లో వడోదర, వారణాసి లోక్సభ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన మోడీ అఖండ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement