ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. ఇద్దరు దుండగులు ఢిల్లీ శివారున ఉన్న గురుగ్రామ్ నుంచి ఓ యువతిని (21) కిడ్నాప్ చేసి కారులో తీసుకువచ్చి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి నైరుతి ఢిల్లీలోని ద్వారక సమీపంలో హరివిహార్‌లో ఈ దారుణం జరిగింది.
నిందితులు ఆమెను ఓ ఫ్లాట్‌లో బంధించి తాళం వేశారు. వారి బారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ యువతి బిల్డింగ్‌పై నుంచి పడి గాయపడింది. ఆమెను ఆపే క్రమంలో ఓ నిందితుడు గాయపడ్డాడు. వీళ్లను దొంగలుగా భావించిన ఇరుగుపొరుగు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను హిమ్మత్, సునీల్‌గా గుర్తించారు. సునీల్ గతంలో ఉబెర్ డ్రైవర్‌గా పనిచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిపారు.
దేశ రాజధానిలో మరో దారుణం
Published Thu, Dec 22 2016 5:50 PM | Last Updated on Wed, Aug 1 2018 4:24 PM
Advertisement
Advertisement