దేశ రాజధానిలో దారుణం.. | Man Shot Dead, 4 Women Allegedly Gang-Raped On Highway Near Delhi | Sakshi
Sakshi News home page

దేశ రాజధానిలో దారుణం..

Published Thu, May 25 2017 12:55 PM | Last Updated on Wed, Aug 1 2018 4:24 PM

Man Shot Dead, 4 Women Allegedly Gang-Raped On Highway Near Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని సమీపంలో దోపిడి దొంగలు దారుణానికి ఒడిగట్టారు. కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంపై దాడి చేసి ఒకర్ని చంపి, నలుగురు మహిళలపై అత్యాచారం జరిపి దోపిడి చేశారు. ఈ ఘటన గురువారం ఉదయం ఢిల్లీకి 68 కిలోమీటర్ల దూరంలో ఉత్తర్‌ప్రదేశ్‌ లోని జెవార్‌ నగరంలో చోటు చేసుకుంది.
 
ఆసుపత్రిలో ఉన్న బంధువును పరామర్శించడానికి కారులో గ్రేటర్‌ నోయిడా సమీపంలో జేవర్‌కు బయలుదేరారు. ఒంటి గంట సమయంలో కారుపై దుండగులు మెటల్‌ వస్తువు విసరడంతో హైవే మధ్యలో కారును నిలిపివేశారు. దీంతో ఒక్కసారిగా ఆరుగురు అగంతకులు మహిళలపై దాడి చేసి గ్యాంగ్‌ రేప్‌ చేసి వారి ఆభరణాలను దోచుకొని వెళ్లారు. వారిని కాపాడడానికి ప్రయత్నించిన 45 ఏళ్ల కుటుంబ సభ్యున్నిదారుణంగా చంపేశారు. కాగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement