సాక్షి, ముంబై : గర్భిణి మహిళలకు హెచ్1ఎన్1 వ్యాక్సిన్‌ను బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఉచితంగా వేయడం ప్రారంభించింది. కస్తూర్బా ఆస్పత్రి వార్డ్ నెం.19లో ఆరు నుంచి 9 నెలల గర్భిణిలు వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సిన్ వేయనున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. ఇక్కడ గర్భిణిల నుంచి వచ్చే స్పందనను బట్టి తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో ఉన్న మెటర్నిటీ (ప్రసూతి) హోంలలో కూడా ఈ సేవలను ప్రారంభిస్తామని బీఎంసీ ఎపిడమాలజీ ఇన్‌చార్జ్ డాక్టర్ మినిఖేటర్‌పాల్ తెలిపారు.
200 హెచ్1ఎన్1 డోస్‌లు బీఎంసీ వద్ద ఉన్నాయని, ఈ వ్యాక్సిన్ వేయడం ద్వారా హైపర్ టెన్షన్, డయాబెటీస్ రోగుల మరణాల రేటును అరికట్టవచ్చని మహా రాష్ర్ట అంటువ్యాధుల నివారణ, నియంత్రణ సాంకేతిక కమిటీ చైర్మన్ డాక్టర్ సుభాష్ సాలుంకే చెప్పారు. ప్రస్తుతం స్వైన్‌ఫ్లూ ఇన్ఫెక్షన్ నియంత్రణలోనే ఉన్నా నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వివరిం చారు. స్వైన్‌ఫ్లూ కేసులు అధికంగా నమోదవుతు న్న ప్రాంతాల్లో వ్యాక్సిన్ ఇవ్వాలని పేర్కొన్నారు. వైరస్ గరిష్ట స్థాయికి చేరాక వ్యాక్సిన్ వేయించుకున్నా లాభం లేదని ప్రముఖ డాక్టర్ ఓం శ్రీవాస్తవ్ అన్నారు.
గర్భిణిలకు ఉచితంగా హెచ్1ఎన్1 వ్యాక్సిన్
Published Mon, Aug 3 2015 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM
Advertisement
Advertisement