ఎమ్మెల్యే పదవికి యడ్యూరప్ప రాజీనామా | He resigned from the post of the chief minister | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పదవికి యడ్యూరప్ప రాజీనామా

Published Mon, May 26 2014 2:40 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

He resigned from the post of the chief minister

సాక్షి, బెంగళూరు : మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గత శాసన సభ ఎన్నికల్లో యడ్యూరప్ప శికారిపుర నియోజక వర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో తిరిగి మాతృ పార్టీ బీజేపీలో చేరి శివమొగ్గ పార్లమెంటు స్థానం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు.

దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా మూడు రోజుల క్రితం స్పీకర్ కాగోడు తిమ్మప్పకు పంపారు. ఈ విషయంపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప బెంగళూరులో మీడియాతో ఆదివారం మాట్లాడుతూ...యడ్యూరప్ప శాసనసభ స్థానానికి రాజీనామా చేశారని దీనిని ఆమోదించాల్సి ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement