
నేనే సర్వాధికారి
సాక్షి, బెంగళూరు : మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి సర్వాధికారాలు తనవేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. బెంగళూరులో మీడియా ప్రతినిధులతో గురువారం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మంత్రి మండలిలోకి ఎవరిని తీసుకోవాలనే విషయంపై తన నిర్ణయమే అంతిమమని చెప్పారు. వ్యక్తిగత పనిపై ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ ఢిల్లీకి వెళ్లాడని, ఈ విషయంపై మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.