ఈ హృదయం అమరం | He will die for someone else to donate blood | Sakshi
Sakshi News home page

ఈ హృదయం అమరం

Published Thu, May 19 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

ఈ హృదయం అమరం

ఈ హృదయం అమరం

తాను చనిపోతూ మరొకరికి ప్రాణదానం


బెంగళూరు:  ముళబాగులుకు చెందిన మోహన్‌కుమార్ తాను చనిపోతూ మరొకరికి జీవం పోశారు. దీంతో అతని హృదయం మరో శరీరంలో జీవిస్తూ ఆ వ్యక్తికి పునర్జన్మనిచ్చింది. వివరాలు... ముళబాగులకు చెందిన మోహన్‌కుమార్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈనెల 14న స్వస్థలం వద్ద  జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. చికిత్స కోసం మోహన్‌కుమార్‌ను కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులోని మనిపాల్ ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. అంతేకాకుండా మంగళవారం రాత్రి మోహన్‌కుమార్ బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకున్నారని వైద్యులు ధ్రువీకరించారు. అంతేకాకుండా అతని అవయవాలను దానం చేయాడానికి కుటుంబ సభ్యులను ఒప్పించారు.


ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి 12:58 గంటల  సమయంలో ప్రత్యేక ఆంబులెన్స్ ద్వారా మోహన్ కుమార్ శరీరం నుంచి వేరుచేసిన హృదయాన్ని దాదాపు 14 కిలోమీటర్ల దూరంలోని ఎం.ఎస్ రామయ్య ఆసుపత్రికి ఎనిమిది నిమిషాల్లో  వైద్య సిబ్బంది చేర్చారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వైద్యులు హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఓ రోగికి మోహన్‌కుమార్ గుండెను విజయవంతంగా అమర్చారు. కాగా, అంబులెన్‌‌స ప్రయాణిం చే మార్గంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నగర ట్రాఫిక్ విభాగం గ్రీన్‌కారిడార్‌ను ఏర్పాటు చేసింది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement