మేమున్నాం
నేపాల్ బాధితులకు కన్నడిగుల ఆపన్నహస్తం
పరిహార నిధికి ఒక నెల వేతనాన్ని ప్రకటించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు 10 మంది సభ్యులతో నేపాల్‌కు వైద్య బృందం
బెంగళూరుకు సురక్షితంగా చేరుకున్న 100 మంది కన్నడిగులు
బెంగళూరు: భూమాత ప్రకోపానికి చిగురుటాకులా విలవిల్లాడిన నేపాల్‌కు తమ వంతు సహా యం అందించేందుకు కన్నడిగులు ముందుకు వస్తున్నారు. నేపాల్‌లో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా నిరాశ్రయులైన వారికి ఆపన్నహస్తం అందించేందుకు సిద్ధమయ్యారు. నేపాల్‌లో సంభవించిన ప్రకృతి విలయంలో వృుతి చెందిన వారికి కర్ణాటక ఉభయసభల సభ్యులు సోమవారం తమ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. అంతేకాదు నేపాల్ బాధితులను ఆదుకునేందుకు గాను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఒక నెల వేతనాన్ని పరిహార నిధికి అందజేయనున్నారు. నేపాల్‌లో సంభవించిన ప్రకృతి విపత్తులో చిక్కుకున్న వారికి సహాయం అందించేందుకు గాను రాష్ట్రం నుంచి 10 మంది సభ్యులు గల రెండో వైద్యృబందం బెంగళూరు నుంచి సోమవారం బయలుదేరింది. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ నివాసంలో ఏర్పాటైన సమావేశంలో నేపాల్ బాధితులను ఆదుకునేందుకు సంబంధించిన మార్గసూచిపై వైద్యులతో మంత్రి యు.టి.ఖాదర్ చర్చించారు. అనంతరం వైద్యులృబందం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ మార్గం గుండా నేపాల్‌కు చేరుకునేందుకు ప్రయాణం ప్రారంభించింది. ఇక వైద్యులృబందంతో పాటు వైద్యులకు అవసరమైన ఆహార పదార్థాలతో పాటు దాదాపు 200 కేజీల వరకు ఔషధాలను సైతం వైద్యులతో పాటు పంపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాల మేరకు వైద్యులృబందాన్ని నేపాల్ పంపుతున్నట్లు మంత్రి యు.టి.ఖాదర్ తెలిపారు. నేపాల్ బయలుదేరిన వైద్యులృబందంలో కె.సి.జనరల్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ మంజునాథ్, జయనగర జనరల్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ రాజేష్, డాక్టర్ కిరణ్‌కుమార్ తదితరులున్నారు.
సురక్షితంగా చేరుకున్న 100 మంది కన్నడిగులు....
ఇక కేంద్ర ప్రభుత్వంతో పాటు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల ద్వారా నేపాల్‌లో చిక్కుకున్న 381 మంది కన్నడిగుల్లో దాదాపు 100 మంది కన్నడిగులు సోమవారానికి బెంగళూరుకు చేరుకున్నారు. మరో 70 మంది వరకు కన్నడిగులు మంగళవారం ఉదయానికి ఢిల్లీలోని కర్ణాటక భవన్‌కు చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక మండ్య జిల్లా హరనహళ్లి నుంచి నేపాల్ సందర్శనకు వెళ్లిన 35 మంది పర్యాటకులు సోమవారం సాయంత్రానికి గోరఖ్‌పూర్ చేరుకున్నట్లు సమాచారం. నేపాల్ ప్రకృతి విలయం నుంచి బయటపడిన బెంగళూరుకు చెందిన రవీంద్ర, జానకి దంపతులు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిశారు. తమను సురక్షితంగా బెంగళూరుకు చేర్చేందుకు శ్రమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా వారు కృత జ్ఞతలు తెలియజేశారు. ఇక నేపాల్ అందాలను తిలకించేందుకు వెళ్లి అక్కడ సంభవించిన ప్రకృతి విలయం నుంచి బయటపడ్డ జానకి అక్కడ తమకు ఎదురైన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.