the medical team
-
మేమున్నాం
నేపాల్ బాధితులకు కన్నడిగుల ఆపన్నహస్తం పరిహార నిధికి ఒక నెల వేతనాన్ని ప్రకటించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు 10 మంది సభ్యులతో నేపాల్‌కు వైద్య బృందం బెంగళూరుకు సురక్షితంగా చేరుకున్న 100 మంది కన్నడిగులు బెంగళూరు: భూమాత ప్రకోపానికి చిగురుటాకులా విలవిల్లాడిన నేపాల్‌కు తమ వంతు సహా యం అందించేందుకు కన్నడిగులు ముందుకు వస్తున్నారు. నేపాల్‌లో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా నిరాశ్రయులైన వారికి ఆపన్నహస్తం అందించేందుకు సిద్ధమయ్యారు. నేపాల్‌లో సంభవించిన ప్రకృతి విలయంలో వృుతి చెందిన వారికి కర్ణాటక ఉభయసభల సభ్యులు సోమవారం తమ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. అంతేకాదు నేపాల్ బాధితులను ఆదుకునేందుకు గాను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఒక నెల వేతనాన్ని పరిహార నిధికి అందజేయనున్నారు. నేపాల్‌లో సంభవించిన ప్రకృతి విపత్తులో చిక్కుకున్న వారికి సహాయం అందించేందుకు గాను రాష్ట్రం నుంచి 10 మంది సభ్యులు గల రెండో వైద్యృబందం బెంగళూరు నుంచి సోమవారం బయలుదేరింది. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ నివాసంలో ఏర్పాటైన సమావేశంలో నేపాల్ బాధితులను ఆదుకునేందుకు సంబంధించిన మార్గసూచిపై వైద్యులతో మంత్రి యు.టి.ఖాదర్ చర్చించారు. అనంతరం వైద్యులృబందం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ మార్గం గుండా నేపాల్‌కు చేరుకునేందుకు ప్రయాణం ప్రారంభించింది. ఇక వైద్యులృబందంతో పాటు వైద్యులకు అవసరమైన ఆహార పదార్థాలతో పాటు దాదాపు 200 కేజీల వరకు ఔషధాలను సైతం వైద్యులతో పాటు పంపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాల మేరకు వైద్యులృబందాన్ని నేపాల్ పంపుతున్నట్లు మంత్రి యు.టి.ఖాదర్ తెలిపారు. నేపాల్ బయలుదేరిన వైద్యులృబందంలో కె.సి.జనరల్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ మంజునాథ్, జయనగర జనరల్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ రాజేష్, డాక్టర్ కిరణ్‌కుమార్ తదితరులున్నారు. సురక్షితంగా చేరుకున్న 100 మంది కన్నడిగులు.... ఇక కేంద్ర ప్రభుత్వంతో పాటు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల ద్వారా నేపాల్‌లో చిక్కుకున్న 381 మంది కన్నడిగుల్లో దాదాపు 100 మంది కన్నడిగులు సోమవారానికి బెంగళూరుకు చేరుకున్నారు. మరో 70 మంది వరకు కన్నడిగులు మంగళవారం ఉదయానికి ఢిల్లీలోని కర్ణాటక భవన్‌కు చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక మండ్య జిల్లా హరనహళ్లి నుంచి నేపాల్ సందర్శనకు వెళ్లిన 35 మంది పర్యాటకులు సోమవారం సాయంత్రానికి గోరఖ్‌పూర్ చేరుకున్నట్లు సమాచారం. నేపాల్ ప్రకృతి విలయం నుంచి బయటపడిన బెంగళూరుకు చెందిన రవీంద్ర, జానకి దంపతులు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిశారు. తమను సురక్షితంగా బెంగళూరుకు చేర్చేందుకు శ్రమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా వారు కృత జ్ఞతలు తెలియజేశారు. ఇక నేపాల్ అందాలను తిలకించేందుకు వెళ్లి అక్కడ సంభవించిన ప్రకృతి విలయం నుంచి బయటపడ్డ జానకి అక్కడ తమకు ఎదురైన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. -
వెంటాడుతున్న స్వైన్ ఫ్లూ
కడప రూరల్: స్వైన్ ఫ్లూ భయూలు జిల్లా వాసులను వెంటాడుతున్నారుు. బుధవారం ప్రొద్దుటూరులో మరొకరిలో వ్యాధి లక్షణాలు కనిపించారుు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వారి సంఖ్య మూడుకు చేరింది. విషయం తెలియగానే వైద్య బృందం హుటాహుటిని వెళ్లి జాగ్రత్తలు చేపట్టింది. జనవరికి ముందు కడప నగరంలోని ఆర్కే నగర్, ప్రకాశ్నగర్లలో ఒక్కొక్కరికి స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. వారు తక్షణమే హైదరాబాదులో చికిత్స పొందడంతో ఆరోగ్యం కుదుటపడింది. జిల్లాలో వ్యాధి సోకిన ఆ ముగ్గురు కూడా హైదరాబాదులో బంధువుల వద్ద ఉండి వచ్చిన తర్వాతనే లక్షణాలను గుర్తించినట్లు వైద్యులు అంటున్నారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన డీఎంహెచ్ఓ ఈ వ్యాధికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ప్రొద్దుటూరులో వ్యాధి లక్షణాలు బయటపడగానే డీఎంహెచ్ఓ ఒక అత్యవసర బృందాన్ని అక్కడికి పంపారు. అవసరమైన తక్షణ చర్యలు చేపట్టడానికి సిబ్బందిని సిద్ధం చేశారు. ముందస్తు జాగ్రత్తగా 100 ట్యామిఫ్లూ మాత్రలను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే కడప రిమ్స్‌లో ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. చలి తీవ్రంగా ఉండడంతో అంతటా వైరస్ వ్యాపిస్తోందని, చలి తీవ్రత తగ్గి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగితే వైరస్ కనుమరగవుతుందనే అభిప్రాయాన్ని వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ స్వైన్‌ఫ్లూ కారణంగా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పుకార్లను అసలు నమ్మవద్దని సూచిస్తున్నారు. జిల్లాకు ఈ వైరస్ ఎలాంటి పరిస్థితిలో రాదని వైద్యులు అంటున్నారు. కాగా, ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే సూచనలు, సలహాల కోసం తక్షణమే వైద్యులను సంప్రదించాలన్నారు. ఆందోళన అవసరం లేదు స్వైన్‌ఫ్లూ వ్యాధికి సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ మన జిల్లా వాతావరణానికి ఇమడదనే చెప్పవచ్చు. అయితే ప్రజలు జాగ్రత్తలు పాటించడం మంచిది. ఈ వ్యాధి సోకిన వారికి తీవ్రమైన జులుబు, జ్వరం, గొంతునొప్పి, ఆయాసం, శ్వాస సంబంధిత ఇబ్బందికర లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి వారు తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ముందస్తు జాగ్రత్తగా ట్యామిఫ్లూ మాత్రలను అందుబాటులో ఉంచాం. ఇతర ప్రాంతాలకు వెళ్లే జిల్లా వాసులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే జిల్లాకు వచ్చేవారు కూడా జాగ్రత్తలు పాటించడం మంచిది. ఈ వ్యాధికి సంబంధించి అన్ని చర్యలు చేపట్టాం. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. జిల్లా వాసులు పుకార్లను నమ్మవద్దు. - నారాయణ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, వెఎస్సార్‌జిల్లా -
కిడ్నీ మార్పిడిలో ‘కేర్’ 95% విజయవంతం
సాక్షి, హైదరాబాద్: మూత్ర పిండాల మార్పిడిలో తమ వైద్య బృందం 95 శాతం విజయం సాధించినట్లు కేర్ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగం డెరైక్టర్ డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి పేర్కొన్నారు. దేశంలోనే 500 మూత్ర పిండాల మార్పిడి చేసిన ఘనతను కేర్ ఆసుపత్రి సాధించిందని ఆయన వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2004లోనే మార్పిడి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి తక్కువ కాలంలో మెరుగైన వైద్య సేవలు అందించడంలో తాము అగ్రగామిగా ఉన్నామన్నారు. దేశంలోని వివిధ కేర్ ఆసుపత్రుల్లో మూత్రపిండాల మార్పిడి చేశామని.. ఒక్క హైదరాబాద్ కేర్‌లోనే 300 చేసినట్లు పేర్కొన్నారు. జీవదాతలు, బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి మూత్రపిండాలు సేకరించి బాధితులకు మార్పిడి చేసి మంచి ఫలితాలు సాధించామన్నారు. పరస్పర అవగాహనతో ఇద్దరు బాధితుల కుటుంబాల నుంచి కిడ్నీలు సేకరించి ‘స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్’కు కేర్ ఆసుపత్రి దక్షిణ భారత దేశంలో మొదటిసారిగా శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ట్రాన్స్‌ప్లాంట్ విభాగం సర్జన్లు డాక్టర్ కె.రామరాజు, డాక్టర్ బీవీ రామరాజు పాల్గొన్నారు. -
ఆపద్బాంధవులు
శ్రీనగర్‌లో తుపాన్ బాధితులకు సేవలందిస్తున్న నాగర్‌కర్నూలు వైద్య బృందం నాగర్‌కర్నూల్: జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల వచ్చిన తుఫాన్‌తో అనేకమంది ప్రాణాలు కోల్పో గా, వందలాది మంది నిరాశ్రయులై రోగాలబారిన పడ్డారు. వారిని ఆదుకునేందుకు నాగర్‌కర్నూల్‌కు చెందిన డాక్టర్ రాంకిషన్ వైద్య బృం దం గత ఐదు రోజుల నుంచి శ్రీనగర్‌లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి సేవలందిస్తోం ది. ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో రిమ్స్‌లో ఆర్థో ప్రొ ఫెసర్‌గా పనిచేస్తున్న స్థానిక వెన్నెల ఆర్థోపెడిక్ ఆస్పత్రి డాక్టర్ రాంకిషన్ సారథ్యంలో డాక్టర్ల బృందం సేవలందించడానికి ముందుకొచ్చిం ది. ఈనెల 27న జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌కు వెళ్లి అక్కడ వివిధ ప్రాంతాల్లో తు ఫాన్ బాధితుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి మందులను ఉచితంగా అం దిస్తోంది. అక్కడి నుంచి మంగళవారం డాక్టర్ రాంకిషన్ ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడారు. బాధితులకు అక్కడి ప్రభుత్వం సరైన సహాయక చర్యలు చేపట్టలేకపోవడంతో నిరాశ్రయులైన వారు సాయం కోసం ఎదురుచూస్తున్నారని తె లిపారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా ఏడుగురు వైద్యులు పరీక్షలు జరిపి ఉ చితంగా మందులను అందజేస్తున్నామని, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన దుప్పట్లు, దుస్తులు, ఇతర వస్తువులను కూడా బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు. తా ను మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి *5లక్షల విలువ చేసే మందులను, 2100 దు ప్పట్లు, దుస్తులను సేకరించి పంపిణీ చేసినట్లు చెప్పారు. అక్కడి ప్రజలను ఆదుకునేందుకు జి ల్లావాసులు మానవతాదృక్పథంతో ముందుకు రావాలని ఆయన కోరారు.